Ilaiyaraaja | తమిళ సంగీత దర్శకుడు ఇళయరాజా (Ilaiyaraaja) ‘మంజుమ్మెల్ బాయ్స్’ (Manjummel Boys) చిత్ర నిర్మాతకు లీగల్ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. తన అనుమతి లేకుండా ‘గుణ’లోని పాటను సినిమాలో వాడారంటూ నోటీసుల్లో పేర్కొన్నారు.
మంజుమ్మెల్ బాయ్స్ లో ఇళయరాజా (Ilaiyaraaja) కంపోజ్ చేసిన కమల్ హాసన్ క్లాసిక్ సినిమా గుణలోని.. కమ్మని నీ ప్రేమ లేఖనే రాసింది హృదయమే అంటూ సాగే పాట, మ్యూజిక్‌ను వాడారని తెలిసిందే. సినిమా ఓపెనింగ్ క్రెడిట్స్, క్లైమాక్స్‌లో వాడిన పాటకు మంచి ప్రశంసలు దక్కాయి. అయితే దీనిపై ఇళయరాజా అభ్యంతరం వ్యక్తం చేస్తూ మేకర్స్‌కు లీగల్ నోటీసులు పంపించారు. తన క్రియేటివ్ వర్క్ (పాట, సంగీతం)ను అసందర్భోచితంగా వినియోగించినందుకు నష్టపరిహారం అందించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే దీనిపై చిత్రబృందం స్పందిస్తూ.. ఈ సాంగ్ విషయంలో గుణ మూవీ ఆడియో హక్కులు కలిగిన మ్యూజిక్ లేబుల్ నుంచి అనుమతి తీసుకున్న తర్వాతే ఈ పాటను వాడినట్లు తెలిపారు.
అయితే వివాదం జరిగిన చాలారోజుల తర్వాత ఈ సమస్య సద్దుమణిగినట్లు వార్తలు వస్తున్నాయి. దీనికోసం ఇళయరాజా రూ.2కోట్లు నష్టపరిహారం డిమాండ్ చేశారనీ.. అయితే రూ.2 కోట్లు ఇవ్వలేని చిత్ర నిర్మాత షాన్ ఆంటోనీ రూ.60 లక్షల వరకూ చెల్లించారని సమాచారం. ఇక ఇదే విషయంపై ఇళయరాజా లాయర్‌ను మీడియా సంప్రదించగా.. ఇవ్వని రూమర్స్ అని పూర్తిగా ఖండించారు. పాట విషయంలో రాజా నోటీసులు పంపిన విషయం వాస్తవమే కానీ ఎటువంటి డబ్బు తీసుకోలేదని వెల్లడించారు.
ఇక దీనిపై చిత్రబృందం కూడా స్పందిస్తూ.. ఇళయరాజాకు మేం ఎలాంటి పరిహారం ఇవ్వాల్సిన అవసరం లేదని నిర్మాత షాన్ అంటోని వెల్లడించారు. ఈ సాంగ్ విషయంలో గుణ మూవీ ఆడియో హక్కులు కలిగిన మ్యూజిక్ మాస్టర్ ఆడియో అండ్ వీడియో, LLP కంపెనీలతో పాటు శ్రీదేవీ మ్యూజిక్ కార్పోరేషన్ సంస్థ నుంచి కూడా అనుమతులను తీసుకున్నాం అంటూ నిర్మాత వెల్లడించారు.
Also Read..
Rakul Preet Singh | హైదరాబాద్‌లో ‘ఆరంభం’ పేరుతో మరో బ్రాంచ్‌ను ఓపెన్ చేసిన రకుల్ ప్రీత్‌సింగ్
KTPS | కేటీపీఎస్ పాత ప్లాంట్ కూలింగ్ టవర్ల కూల్చివేత