Ponniyin Selvan-2 Release date | ప్రస్తుతం సినీ అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న చిత్రం ‘పొన్నియన్ సెల్వన్-1’. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం రూపొందించిన ఈ చిత్రం సెప్టెంబర్ 30న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన టీజర్, ట్రైలర్లు సినిమాపై విపరీతమైన అంచనాలను క్రియేట్ చేశాయి. మణిరత్నం టేకింగ్, విజువల్స్‌ను ఎప్పుడెప్పుడు తెరపై చూద్ధామా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ వరుస అప్డేట్లను ప్రకటిస్తూ సినిమాపై అంతకంతకూ క్యూరియాసిటీని పెంచుతున్నారు. ప్రస్తుతం చిత్రబృందం ప్రమోషన్లను స్టార్ట్ చేసింది. ప్రమోషన్లలో భాగంగా మేకర్స్ పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకుంటున్నారు.
ప్రమోషన్లో భాగంగా మణిరత్నం పొన్నియన్ సెల్వన్ పార్ట్-2 రిలీజ్ డేట్ గురించి వెల్లడించారు. మొదటి భాగం విడుదలైన ఆరు నుండి తొమ్మిది నెలలోపే సెకండ్ పార్ట్‌ను విడుదల చేస్తామని చెప్పాడు. దీన్ని బట్టి చూస్తే వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా పొన్నియన్ సెల్వన్ పార్ట్-2ను విడుదల చేసే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే ఈ రెండు పార్ట్‌లకు సంబంధించిన డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ రూ.125 కోట్లకు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. పీరియాడికల్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్ర మొదటి భాగంలో చియాన్ విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష, బాబీ సింహా వంటి స్టార్లు ప్రధాన పాత్రల్లో నటించారు. స్వర మాంత్రికుడు ఏ.ఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. లైకా ప్రొడక్షన్స్ సంస్థతో కలిసి మద్రాస్ టాకీస్ బ్యానర్‌పై మణిరత్నం స్వీయ నిర్మాణంలో తెరకెక్కించాడు.
Read Also:
Captain Miller | ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్’లో టాలీవుడ్ యంగ్ హీరో?
Varun Tej | ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్‌గా వరుణ్ తేజ్.. ఆసక్తి రేకిత్తిస్తున్న ‘VT13’ స్పెషల్ వీడియో
Project-k Movie | ‘ప్రాజెక్ట్-K’ కోసం ఐదుగురు హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్లు?
RRR Movie | ఆస్కార్ బరిలో ‘ఆర్ఆర్ఆర్’.. ఏకంగా మూడు కేటగిరిల్లో నామినేషన్స్?