రేవంత్‌రెడ్డిది అరాచక పాలన
రాష్ట్రంలో అరాచక పాలన సాగుతున్నదని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. అచ్చంపేట ఎమ్మెల్యేతో అవమానానికి గురైన నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలం జాజా ల సర్పంచ్ కాశమ్మను శనివారం రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆర్ఎస్ ప్రవీణ్ పరామర్శించారు. అనంతరం పోతారెడ్డిపల్లి శివారులోని దుందుభి వాగులో సాగుతున్న ఇసుక అక్రమ రీచ్‌లను పరిశీలించారు.
- కాంగ్రెస్ హయాంలో మహిళలకు గౌరవం, రక్షణ కరువు
- బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్
- ఎమ్మెల్యే చేతిలో అవమానానికి గురైన సర్పంచ్‌కు పరామర్శ
వంగూరు, సెప్టెంబర్ 26 : రాష్ట్రంలో అరాచక పాలన సాగుతున్నదని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. అచ్చంపేట ఎమ్మెల్యేతో అవమానానికి గురైన నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలం జాజా ల సర్పంచ్ కాశమ్మను శనివారం రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆర్ఎస్ ప్రవీణ్ పరామర్శించారు. అనంతరం పోతారెడ్డిపల్లి శివారులోని దుందుభి వాగులో సాగుతున్న ఇసుక అక్రమ రీచ్‌లను పరిశీలించారు.
విద్యుత్తు సరఫరా, సమస్యలను అడిగి తెలుసుకొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంచాయతీరాజ్ చట్టాలు ఇచ్చిన అధికారాలతో జాజాల సర్పంచ్ తన హక్కులను ఉపయోగించి గ్రామాభివృద్ధి కోసం పాటుపడుతుంటే.. మహిళా సర్పంచ్‌ను అవమానించడం ఎమ్మెల్యే వంశీకృష్ణకు తగదని అన్నారు. సీఎం సొంత మండలంలో ఓ దళిత మహిళా సర్పంచ్ వివక్షకు గురవుతుంటే రేవంత్‌రెడ్డి పట్టించుకోకపోవడం వారి పాలనకు నిదర్శనమని అన్నారు. సర్పంచ్‌కు వచ్చే బిల్లులను ఇప్పించి ఎమ్మెల్యే బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశా రు.
దుందుభి వాగులో అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా తరలించడం వెనుక సీఎం కుటుంబ సభ్యులు, అనుచరుల అండదండలు ఉన్నాయని ఆరోపించారు. నిజంగా అనుమతులు ఉంటే పట్టపగలు రవాణా చేయాలని డిమాండ్ చేశారు. ఇదే విషయాన్ని ప్రశ్నిస్తే మైనింగ్ అధికారులు నీళ్లు నములుతున్నారని, ఇది ముమ్మాటికీ అక్రమ మైనింగ్ సాగుతున్నట్టేనని పేర్కొన్నారు. సీఎం సొంతూరు కొండారెడ్డిపల్లిలో 24 గంటల విద్యుత్తు అందుతుండగా.. పక్కనే ఉన్న పోల్కంపల్లి, ఇతర గ్రామాలకు 9 గంటల కరెంట్ మాత్రమే సరఫరా చేయడమంటే రైతులను మోసం చేయడమేనని అన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rythu Runa Mafi | రుణమాఫీకి కుంటిసాకులు.. అర్హత ఉన్నా రైతుకు అందని వైనం
IPS Transfers | రాష్ట్రంలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు.. హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఔట్
Rice Millers | ప్రభుత్వం ఓడిందా? రైస్ మిల్లర్లు గెలిచారా?.. పౌరసరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆకస్మిక బదిలీ
Bharat Summit | కరువు వేళ.. కాంగ్రెస్ వేడుక.. ఆర్భాటాలకు కోట్లు కుమ్మరిస్తున్న సర్కార్.. తాజాగా భారత్సమ్మిట్కు 50 కోట్లు
Horoscope | 13-11-2026 శుక్రవారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

