హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): సంపద సృష్టించడం చేతగాక ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించడం, ప్రజా ఆస్తులు అమ్ముకోవడమే ప్రజాపాల న ఉద్దేశమా అని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. శనివారం ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. రేవంత్ సర్కార్కు ఆదాయం పెంచే విజన్, పెట్టుబడులు తెచ్చే విస్డమ్ లేదని దుయ్యబట్టారు. అధికారంలోకి రాగానే ప్రభుత్వ భూములను అమ్మకానికి పెట్టారని విమర్శించారు.
రాష్ర్టానికి గుండెకాయ లాంటి సింగరేణిని, విద్యుత్తురంగ వాటాలను అదానీ, అంబానీలాంటి కార్పొరేట్ పెద్దల జేబుల్లో వేసి తె రవెనుక వ్యక్తిగత లబ్ధి పొందాలని కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కార్మికుల రక్తం, చెమటతో నిర్మితమైన ప్రభుత్వరం గ సంస్థలను బలిపీఠం ఎకిస్తూ, ప్రజల ఆస్తులను తెగనమ్మి పాలన నెట్టుకురావ డం పరిపాలనాపరమైన సంసరణ కాద ని, ప్రభుత్వ సంపూర్ణ వైఫల్యమని విమర్శించారు. గని కార్మికుల కడుపు కొట్టి, తె లంగాణ భవిష్యత్తును తాకట్టు పెట్టే ఆలోచనలను వెంటనే విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.