“మండాడి’ సినిమా విషయంలో మా నమ్మకం నిజమైంది. ప్రతీ కేంద్రంలో హౌస్‌ఫుల్స్ అవుతున్నాయి. ఈ ఏడాదిలో ఈ సినిమా కూడా మా సంస్థకు ఓ బిగ్గెస్ట్ హిట్. టీమ్ పడిన కష్టానికి ప్రతిఫలం దక్కింది’ అన్నారు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు వై.రవిశంకర్, నవీన్ యెర్నేని. ఇటీవల విడుదలైన ‘మండాడి’ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ థియేట్రికల్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. సూరి, సుహాస్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి మదిమారన్ పుగళేంది దర్శకుడు.
ఎల్రెడ్ కుమార్ నిర్మాత. ఈ సందర్భంగా శనివారం సక్సెస్‌మీట్‌ను ఏర్పాటు చేశారు. ఈ సినిమా చూసిన మొదటి రోజే బ్లాక్‌బస్టర్ హిట్ అని నిర్మాత నవీన్‌గారు చెప్పారని, ఆయన అంచనాలు నిజమయ్యాయని హీరో సుహాస్ అన్నారు. ఈ సినిమా విషయంలో డిస్ట్రిబ్యూటర్లందరూ హ్యాపీగా ఉన్నారని నిర్మాత ఎల్రెడ్ కుమార్ చెప్పారు. మూడో రోజు వంద స్క్రీన్లు పెంచామని మైత్రీ శశి పేర్కొన్నారు.