Kannappa Promotions | మంచు ఫ్యామిలీ నుంచి వస్తున్న డ్రీమ్ ప్రాజెక్టు ‘కన్నప్ప’ ఈ నెల 27న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వరుస ప్రమోషన్స్‌లో పాల్గోంటున్నాడు కథానాయకుడు మంచు విష్ణు. ఇందులో భాగంగానే సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నాడు. అయితే రీసెంట్గా ఈ సినిమాలోని శివయ్య(Sivayya) అనే డైలాగ్‌ను సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడంతో పాటు శ్రీవిష్ణు నటించిన సింగిల్ సినిమాలో కూడా వాడిన విషయం తెలిసిందే. దీనిపై సీరియస్ అయిన మంచు విష్ణు సింగిల్ చిత్రబృందంకి వార్నింగ్ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. ప్రొడ్యూసర్ కౌన్సిల్‌కు లేఖ రాసి, ఆ డైలాగ్‌ను తీయించేశారని అప్పట్లో గుసగుసలు వినిపించాయి. అయితే ఈ వివాదంపై తాజాగా స్పందించాడు మంచు విష్ణు.
‘సింగిల్’ సినిమాలో ‘శివయ్యా’ డైలాగ్‌ను అల్లు అరవింద్ ఎందుకు తీయించేశారు, మీరేమైనా చేశారా? అన్న ప్రశ్నకు మంచు విష్ణు సమాధానమిస్తూ, “నేను ప్రొడ్యూసర్ కౌన్సిల్‌కు ఒక లేఖ రాశాను. బయటి వాళ్ళందరూ మనల్ని విమర్శించేటప్పుడు.. లేకపోతే ఎగతాళి చేసేటప్పుడు మనమందరం ఒకటి అవ్వాలి. మనమందరం ఒకటిగా ఉండాలి. ఆ సినిమాలో ఒకటి నందమూరి బాలకృష్ణ గారిని ఇమిటేట్ చేసి ఎగతాళి చేశారు. అదే టైమ్ లో ఆయనకు పద్మ భూషణ్ అవార్డు వచ్చింది. ఒక్కరు కూడా ఆయనకు కంగ్రాట్స్ మెసేజ్ పెట్టలేదు కానీ, ఆయన కామెడీ అయితే చేశారు. అలాగే కన్నప్ప సినిమాలోని శివయ్య డైలాగ్పై కూడా ట్రోల్ చేశారు. ఇండస్ట్రీలో ఇది ఏమైనా కొత్త ట్రెండా..? ఒకవేళ కొత్త ట్రెండ్ అయితే చెప్పండి.. రేపు నా సినిమాలో కూడా ఇలానే పెట్టి తీస్తాను అప్పుడు నన్ను ఎవరైనా అడిగితే మాత్రం బావుండదు. అలాగే శివయ్య డైలాగ్ తీయమని నేను అరవింద్‌కి చెప్పలేదు. వాళ్లే తీసేశారు. వాళ్లు ఎందుకు తీశారో అరవింద్గారినే అడగండంటూ మంచు విష్ణు చెప్పుకోచ్చాడు.
ఈ చిత్రం జూన్ 27న విడుదల కానున్న విషయం తెలిసిందే. ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ వంటి స్టార్ హీరోలు ప్రత్యేక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
Manchu Vishnu About Rift with Allu Aravind over #Single Movie. #Kannappa pic.twitter.com/ksH9IIz8HL
— Telugu Chitraalu (@TeluguChitraalu) June 6, 2025
Read More