Manchu Vishnu Completes Pilgrimage to 12 Jyotirlinga | ప్రముఖ సినీ నటుడు, నిర్మాత మంచు విష్ణు 12 జ్యోతిర్లింగాల దర్శన యాత్రను పూర్తి చేశారు. ఈ యాత్రలో భాగంగా 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలం మల్లికార్జున స్వామిని బుధవారం దర్శించుకున్నారు. ఈ విషయాన్ని మంచు విష్ణు తన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం కన్నప్ప. మంచు ఫ్యామిలీ ప్రెస్టీజియస్‌గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా వరుస ప్రమోషన్స్‌లో పాల్గోంటున్నాడు నటుడు మంచు విష్ణు.
భక్తిరస చిత్రంగా రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా.. మంచు విష్ణు గత కొంతకాలంగా దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న జ్యోతిర్లింగాలను సందర్శిస్తూ వస్తున్నారు. ఈ యాత్రలో భాగంగా ఆయన కేదార్నాథ్, రామేశ్వరం, సోమనాథ్ వంటి పుణ్యక్షేత్రాలను సందర్శించారు. ఇక 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకోవడంతో ఆయన 12 జ్యోతిర్లింగాల యాత్ర పూర్తయింది. తాజాగా ఈ విషయాన్ని మంచు విష్ణు వెల్లడించారు.
శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయంలో దర్శనం పూర్తవడంతో, పన్నెండు జ్యోతిర్లింగాలను దర్శించుకోవాలన్న తన కోరిక నెరవేరిందని విష్ణు ఆనందం వ్యక్తం చేశారు. “నా మనసు నిండిపోయింది. నా ఆత్మ ఆశీర్వదించబడినట్లు అనిపిస్తుంది. జీవితం ప్రస్తుతం సానుకూలత, కృతజ్ఞత మరియు శాంతితో నిండి ఉంది” అని ఆయన ట్వీట్ చేశారు. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ‘కన్నప్ప’ చిత్రం తన హృదయానికి చాలా దగ్గరైనదని, ఈ సినిమా కథ తాను ప్రస్తుతం అనుభవిస్తున్న స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందని ఆయన పేర్కొన్నారు. హర్ హర్ మహాదేవ్! #Kannappa27thJune అంటూ ఆయన తన ఎక్స్ ఖాతాలో రాసుకోచ్చారు.
Twelve Jyotirlingas. One journey. Eternal peace.
Just completed the sacred darshan at Sri Sailam Mallikarjuna Swamy Temple — one of the twelve revered Jyotirlingas of Lord Shiva.
With this visit, my journey to all twelve Jyotirlinga temples comes to a divine close.
My heart is… pic.twitter.com/COYa872JrG
— Vishnu Manchu (@iVishnuManchu) June 25, 2025
Read More