Shubhanshu Shukla | రోదసిలోకి శుభాన్షు శుక్లా.. నింగిలోకి దూసుకెళ్లిన ఫాల్కన్ రాకెట్
Shubhanshu Shukla | భారతీయులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా (Shubhanshu Shukla) రోదసి యాత్ర ప్రారంభమైంది.
Shubhanshu Shukla | భారతీయులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా (Shubhanshu Shukla) రోదసి యాత్ర ఎట్టకేలకు ప్రారంభమైంది. ‘యాక్సియం-4’ (Axiom -4) మిషన్‌లో భాగంగా శుభాన్షుతోపాటు మరో ముగ్గురు వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బయల్దేరి వెళ్లారు. వీరు ప్రయాణిస్తున్న ఫాల్కన్-9 రాకెట్ ఫ్లోరిడాలోని నాసాకు చెందిన కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి నింగిలోకి దూసుకెళ్లింది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:01 గంటలకు ఈ ప్రయోగం జరిగింది. ఈ వ్యోమనౌక గురువారం సాయంత్రం 4:30 గంటలకు ఐఎస్ఎస్తో అనుసంధానం కానుంది. 14 రోజులపాటూ వ్యోమగాములు అంతరిక్షంలో ఉండనున్నారు. నాసా సహకారంతో శుక్లా ఐఎస్ఎస్లో వివిధ శాస్త్రీయ పరిశోధనలు చేయనున్నారు. ఈ మిషన్‌కు శుక్లా పైలట్‌గా వ్యవహరిస్తున్నారు.
WATCH | #Axiom4Mission lifts off from NASA’s Kennedy Space Centre in Florida, US. The mission is being piloted by India’s IAF Group Captain Shubhanshu Shukla. The crew is travelling to the International Space Station (ISS) on a new SpaceX Dragon spacecraft on the company’s Falcon… pic.twitter.com/jPDKcB44NM
— ANI (@ANI) June 25, 2025
అమెరికా ప్రైవేట్ స్పేస్ సంస్థ యాక్సియం (Axiom Space) చేపడుతున్న మానవ సహిత అంతరిక్ష ప్రయోగం ‘ఏఎక్స్-4’ మిషన్ (Ax 4 mission)లో భాగంగా స్పేస్ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ (SpaceX Falcon 9 rocket) ద్వారా శుభాన్షు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. దీంతో ప్రైవేట్ రోదసి యాత్ర ద్వారా ఐఎస్ఎస్కు వెళ్లిన తొలి భారత వ్యోమగామిగా శుభాన్షు చరిత్రకెక్కారు. ఇప్పటికే భారత్‌కు చెందిన ప్రముఖ వ్యోమగామి రాకేశ్ శర్మ రోదసి యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. రష్యా సహకారంతో అంతరిక్షయానం చేశారు. రాకేశ్ శర్మ రోదసి యాత్ర చేసిన నాలుగు దశాబ్దాల (1984) తర్వాత శుభాన్షు ఈ గౌరవాన్ని దక్కించుకున్నారు.
#WATCH | Lucknow, Uttar Pradesh: Parents of IAF Group Captain & astronaut Shubhanshu Shukla, celebrate as #Axiom4Mission lifts off from NASA’s Kennedy Space Centre in Florida, US.
The mission is being piloted by India’s IAF Group Captain Shubhanshu Shukla. pic.twitter.com/SeRGTUiQeV
— ANI (@ANI) June 25, 2025
వ్యోమనౌకలోకి వెళ్లేముందు .. ఇష్టమైన పాటను విన్న శుభాన్షు శుక్లా
వ్యోమనౌకలోకి వెళ్లేముందు భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా తనకు ఎంతో ఇష్టమైన పాటను విన్నారు. గతేడాది విడుదలైన హృతిక్ రోషన్ నటించిన ‘ఫైటర్’ చిత్రంలోని ‘వందేమాతరం’ (Vande Mataram) పాట అంటే శుభాన్షుకు ఎంతో ఇష్టమట. ఈ సందర్భంగా రోదసి యాత్రకు వెళ్లే ముందు ఆ పాటను విన్నారు. ‘విజయం అనేది ప్రతి భారతీయుడి నరనరాల్లో ఉంటుంది. మన పరాక్రమం అలాంటిది. శత్రువు కూడా మనకు సెల్యూట్ చేస్తాడు’ అంటూ సాగే దేశభక్తిని రగిలించే ఈ పాటను కెన్నెడీ స్పేస్ సెంటర్లోని లాంచ్ ప్యాడ్ 39-Aకి వెళుతూ విన్నారు.
Also Read..
Shubhanshu Shukla | వ్యోమనౌకలోకి వెళ్లేముందు.. తనకు ఎంతో ఇష్టమైన పాటను విన్న శుభాన్షు శుక్లా
Shubhanshu Shukla | రోదసి యాత్రకు రెఢీ.. డ్రాగన్ అంతరిక్ష నౌకలోకి వ్యోమగాములు
Donald Trump | ఇరాన్లో అధికార మార్పిడిపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేసిన ట్రంప్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | నేరస్థులను చూస్తే నవ్వొస్తుంది.. టైగర్ ష్రాఫ్ ఘటనపై ఆర్జీవీ రియాక్షన్
Allu Arjun | అల్లు అర్జున్ ఒక్క పోస్ట్‌తో మళ్లీ మొదలైన మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్ వార్.. రజినీకాంత్‌పై ప్రశంసలే కారణమా?
Stock Market | నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 125 పాయింట్లు పతనం
Rukmini Vasanth | శ్రీకార్తిక్ దర్శకత్వంలో రుక్మిణి వసంత్ క్రేజీ రోడ్ ట్రిప్ చిత్రం.. ప్రోమో విడుదల!
‘గస్తీ నిర్వహణతో నేరాల నియంత్రణకు కృషి చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

