Esha Gupta – Hardik Pandya | టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య(Hardik Pandya)తో బాలీవుడ్ నటి ఇషా గుప్తా (Esha Gupta) డేటింగ్లో ఉన్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ వార్తలపై ఎట్టకేలకు స్పందించింది నటి ఇషా గుప్తా.
తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఇషా గుప్తా మాట్లాడుతూ.. అవును, మేమిద్దరం కొంతకాలం మాట్లాడుకున్నాం. కానీ మేము డేటింగ్ చేశామని నేను అనుకోవడం లేదు. కొన్ని నెలల పాటు మా మధ్య సంభాషణలు జరిగాయి. బహుశా ఇది జరగవచ్చేమో, లేదా జరగకపోవచ్చేమో అన్న దశలో ఉండేవాళ్లం. మేం డేటింగ్ దశకు చేరుకోకముందే అది ముగిసిపోయింది. కాబట్టి దాన్ని డేటింగ్ అని చెప్పలేం అని వివరించారు. తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని, మనస్పర్థలు కూడా రాలేదని.. అయితే మేము కలవడం అనేది రాసిపెట్టిలేదని తెలిపారు. మేమిద్దరూ చాలా భిన్నమైన వ్యక్తులమని, అందుకే విషయాలు ముందుకు సాగలేదని ఇషా చెప్పుకోచ్చారు.