మంచు మనోజ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘డేవిడ్ రెడ్డి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ హిస్టారికల్ డ్రా మాకు హనుమరెడ్డి యక్కంటి దర్శకత్వం వహిస్తున్నారు. వెల్వెట్ సోల్ మోషన్ పిక్చర్స్ పతాకంపై భరత్, నల్లగంగుళ వెంకట్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్‌పై ‘మద్రాస్ ప్రెసిడెన్సీలో పుట్టాడు. ఢిల్లీలో పెరిగాడు.
ఇప్పుడు బ్రిటీష్ సామ్రాజ్యాన్ని వణికిస్తున్నాడు’ అనే మాటలు ఆసక్తినిరేకెత్తించేలా ఉన్నాయి. ‘1897 నుంచి 1922 మధ్యకాలంలో నడిచే కథ ఇది. కుల వ్యవస్థను నిరసించి, బ్రిటీష్ సామ్రాజ్యంపై తిరుగుబాటు జెండా ఎగరేసిన ఓ రెబల్ కథ ఇది. మంచు మనోజ్ పాత్ర శక్తివంతంగా సాగుతుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పూర్వ నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి’ అని మేకర్స్ తెలిపారు.