Manchu Manoj | టాలీవుడ్ యాక్టర్ మంచు మోహన్ బాబు (Mohan babu) ఫ్యామిలీ వార్ కొనసాగుతోంది. ఇప్పటికే మోహన్‌బాబు, కుమారుడు మంచు మనోజ్ (Manchu Manoj) మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా.. తాజా పరిణామాల నేపథ్యంలో మోహన్ బాబు ఇంటి దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ మేరకు పోలీస్ బందోబస్తు కొనసాగుతోంది.
మంచు మనోజ్ (Manchu Manoj) భార్య మౌనికతో కలిసి ఇంటెలిజెన్స్ చీఫ్ కార్యాలయానికి వెళ్లాడు. ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డిని కలిసిన మనోజ్.. తన ఇంట్లో జరుగుతున్న పరిణామాల గురించి వివరించి.. తమకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశాడు. కాగా ఇప్పటికే మంచు విష్ణు-మంచు మనోజ్ బౌన్సర్ల మధ్య ఘర్షణ నెలకొంది. దీంతో మనోజ్ బౌన్సర్లను విష్ణు బౌన్సర్లు ఇంటి నుంచి బయటకు పంపించారు.
ప్రాణహాని ఉందని ఫిర్యాదు..
మనోజ్ నుంచి తనకు ప్రాణహాని ఉందని తెలియజేస్తూ రాచకొండ సీపీకి ఇప్పటికే మోహన్ బాబు లేఖ రాశారు. తనకు రక్షణ కల్పించాలని రాచకొండ సీపీని విజ్ఞప్తి చేశారు. అంతకుముందు మంచు మనోజ్ పహాడిషరీఫ్‌లో తనపై 10 మంది వ్యక్తులు దాడి చేశారని, విజయ్, కిరణ్ సీసీటీవీ పుటేజ్ తీసుకెళ్లారని.. తనకు ప్రాణహాని ఉన్న నేపథ్యంలో రక్షణ కల్పించాలని పోలీసులను కోరాడని తెలిసిందే.
Game Changer | అందమైన లొకేషన్లలో రాంచరణ్, కియారా అద్వానీ.. నానా హైరానా సాంగ్ షూట్ సాగిందిలా..!
Ram Gopal Varma | రాం గోపాల్ వర్మకు భారీ ఊరట.. మూడు కేసుల్లో ముందస్తు బెయిల్