Turbo | మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి (Mammootty) నటించిన సినిమాల్లో ఒకటి టర్బో (Turbo). వైశాక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మే 23న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాగా.. మంచి వసూళ్లు రాబట్టింది. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన టర్బో ఫస్ట్ లుక్, ట్రైలర్, మూవీలో మమ్ముట్టి ఇదివరకెన్నడూ లేని విధంగా షార్ట్ హెయిర్, కోరమీసాలతో ఊరమాస్ లుక్‌లో కనిపించి అభిమానులను ఫుల్ ఖుషీ చేశాడు.
తాజాగా డిజిటల్ ప్లాట్‌ఫాంలో కూడా తన హవా చూపించేందుకు రెడీ అవుతున్నాడు మమ్ముట్టి. టర్బో పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం సోనీ లీవ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఆగస్టు 9 నుంచి ప్రీమియర్ కానున్నట్టు తెలియజేస్తూ రిలీజ్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. రెండున్నర నెలల తర్వాత ఓటీటీలోకి వస్తుండటంతో ఎలాంటి స్పందన ఉంటుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మూవీ లవర్స్.
మలయాళంతోపాటు పలు భారతీయ భాషల్లో రానుందా..? అనే దానిపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ఈ చిత్రానికి మమ్ముట్టి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ అని తెలిసిందే.
Get ready to experience a new level of action with Mammootty’s new avatar as Turbo Jose. Stream Turbo on Sony LIV from August.#Turbo #SonyLIV #TurboOnSonyLIV#Mammootty #MammoottyKampany #Vysakh #MidhunManuelThomas #SamadTruth #TruthGlobalFilms #WayfarerFilms pic.twitter.com/TivaVZD54R
— Sony LIV (@SonyLIV) July 8, 2024
Raj Tarun | రాజ్‌తరుణ్ కేసులో రోజుకో ట్విస్ట్.. రూ.70 లక్షలు ఇచ్చాం : లావణ్య
Trisha | అజిత్‌కుమార్, త్రిష టీంతో వెంకట్ ప్రభు.. స్పెషలేంటో మరి..!
Shankar | కమల్ హాసన్ ఇండియన్ 2 ఎండింగ్లో సర్ప్రైజ్.. శంకర్ ఏం ప్లాన్ చేశాడో మరి.. ?