Turbo Movie- Mammootty | మెగాస్టార్ మమ్ముట్టి ఈ ఏడాది మలయాళ సినీ ఇండస్ట్రీకి బ్యాక్ టూ బ్యాక్ హిట్లను అందించాడు. ‘భ్రమయుగం’ సినిమాతో ఈ ఏడాది మలయాళం ఇండస్ట్రీకి ఫస్ట్ బ్లాక్ బస్టర్ అందించిన మమ్ముట్టి తాజాగా టర్బోతో మరో సూపర్ హిట్‌ను ఇచ్చాడు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా వైశాక్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం మే 23న విడుదలై హిట్ అందుకోవడమే కాకుండా రూ.70 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా ఓటీటీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
ప్రముఖ ఓటీటీ వేదిక సోని లివ్‌లో ఈ సినిమా ఆగష్టు 09 నుంచి మలయాళం, తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవ్వనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. మమ్ముట్టి సొంత నిర్మాణ సంస్థ మమ్ముట్టి కంపెనీ ఈ సినిమాను నిర్మించగా.. టాలీవుడ్ నటుడు సునీల్‌తో పాటు కన్నడ నటుడు రాజ్బీ శెట్టి విలన్ పాత్రలో నటించారు.
Also Read..
Srisailam | శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న కలెక్టర్లు
Janhvi Kapoor | జాన్వీ కపూర్‌ని ఆసుపత్రిలో దగ్గరుండి చూసుకున్న కాబోయే అత్తమ్మ.?
Waqar Younis | పాకిస్థాన్ లెజెండ్‌కు కీలక పదవి.. ఇకపై అంతా అతడేనా..?