Janhvi Kapoor | ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీకపూర్ మెల్లి మెల్లిగా కోలుకుంటున్న విషయం తెలిసిందే. డైజెస్టివ్ ఇమ్యూనిటీ డిజార్డర్ (ఫుడ్ పాయిజన్) కారణంగా అస్వస్థతకు గురైన జాన్వీ కపూర్ (Janhvi Kapoor) ఈ నెల 18న ముంబైలోని ఓ ఆస్పత్రిలో చేరింది. ఇక జాన్వీ కోలుకోవడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంట్లో రెస్ట్ తీసుకుంటుంది. అయితే జాన్వీ ఆస్పత్రి నుంచి త్వరగా కోలుకోవడానికి కారణం తన బాయ్ ఫ్రెండ్ మదర్ అని తెలుస్తుంది.
జాన్వీ కపూర్ శిఖర్ పహరియా(Shikar Pahariya) అనే వ్యక్తితో ప్రస్తుతం డేటింగ్లో ఉన్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఎక్కడికి వెళ్లిన వీళ్లిద్దరు కలిసే వెళుతున్నారు. అయితే జాన్వీకి ఫుడ్ పాయిజన్ అయిన విషయం తెలుసుకున్న శిఖర్ పహరియా తన తల్లిని ఆస్పత్రికి వెంట తీసుకువచ్చినట్లు తెలిసింది. శిఖర్ తల్లి స్మ్రుతి షిండే రాత్రంతా హాస్పిటల్లో జాన్వీ బెడ్ పక్కనే ఉండి కంటికి రెప్పలా కాపాడుకున్నట్లు.. జాన్వీ కోలుకోవడంతో అక్కడ నుంచి వెళ్లినట్లు సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
సినిమాల విషయానికి వస్తే.. జాన్వీ ప్రస్తుతం ఉలాజ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. సుధాన్షు సరియా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 2న విడుదల కానుంది. తెలుగు విషయానికి వస్తే ఎన్టీఆర్తో కలిసి దేవర చిత్రంలో నటిస్తుంది. దీనితో పాటు రామ్ చరణ్- బుచ్చిబాబు సన కాంబోలో వస్తున్న మరో చిత్రంలో ఫిమేల్ లీడ్ రోల్ పోషిస్తుంది.
Also Read..
Manushi Chhillar | మాజీ సీఎం మనవడితో బాలీవుడ్ నటి డేటింగ్.?
Devara Movie | ఏంటి ‘దేవర’ ఇది నిజమేనా.. మీ సినిమా రిలీజ్ 2031లోనా?