శ్రీశైలం : శ్రీశైల (Srisailam ) భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను నంద్యాల కలెక్టర్ రాజకుమారి గనియ(Collector Rajakumari), జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ బుధవారం దర్శించుకున్నారు. వారిని శ్రీకృష్ణరాయ గోపురం వద్ద ఈవో పెద్దిరాజు , అర్చక వేద పండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు అభిషేక, కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేద పండితులు వారికి వేదాశీర్వచనం చేసి స్వామి వారి చిత్రపటం, ప్రసాదం, జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో ఏఈవోలు హరిదాస్, శ్రీనివాస్ రావు, సీఎస్వో అయ్యన్న, సూపరింటెండెంట్ మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.