తిరువనంతపురం : మళయాళ నటి రెంజూష మీనన్ (35) (Renjusha Menon) సోమవారం ఉదయం తిరునంతపురంలోని తన ఫ్లాట్‌లో విగతజీవిగా కనిపించడం కలకలం రేపింది. భర్త మనోజ్‌తో కలిసి ఉంటున్న ఫ్లాట్‌లో రెంజూష ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఆర్ధిక ఇబ్బందుల కారణంగానే ఆమె తీవ్ర నిర్ణయం తీసుకుందని సమాచారం.
రెంజూష మీనన్ ఆత్మహత్య చేసుకుందని ప్రాధమికంగా నిర్ధారించినా మరణానికి దారితీసిన పరిస్ధితులపై పోలీసులు విచారణ చేపట్టారు. కొచ్చికి చెందిన రెంజూష మీనన్ ఆరంభంలో టీవీ షో యాంకర్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసింది.
ఆపై టీవీ సీరియల్స్ ద్వారా బుల్లితెరపై మెరిసి పెద్దసంఖ్యలో ప్రేక్షకాభిమానులను సంపాదించుకుంది. సిటీ ఆఫ్ గాడ్, బాంబే మిర్చ్, కార్యస్ధాన్, వన్ వే టికెట్ వంటి పలు టీవీ షోలు, సినిమాల్లో ఆమె సపోర్టింగ్ రోల్స్‌తో ప్రాచుర్యం పొందింది. ఈ పాత్రల్లో ఆమె ఇంటింటికీ చేరువై అశేష ప్రేక్షకాభిమానం సొంతం చేసుకుంది.
Read More :