Manish Sisodia | లిక్కర్ స్కామ్ కేసుల్లో సిసోడియాకు ఎదురుదెబ్బ.. బెయిల్ తిరస్కరించిన సుప్రీంకోర్టు
Manish Sisodia | ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుల్లో ( liquor policy case)అరెస్టైన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ఆద్మీ పార్టీ నేత మనీష్ సిసోడియా (Manish Sisodia)కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. అవినీతి, మనీలాండరింగ్ కేసుల్లో సిసోడియాకు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు ( Supreme Court) నిరాకరించింది.
Manish Sisodia | ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుల్లో ( liquor policy case)అరెస్టైన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ఆద్మీ పార్టీ నేత మనీష్ సిసోడియా (Manish Sisodia)కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. అవినీతి, మనీలాండరింగ్ కేసుల్లో సిసోడియాకు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు ( Supreme Court) నిరాకరించింది. ఈ మేరకు బెయిల్ కోసం ఆయన దాఖలు చేసిన పిటిషన్లను ధర్మాసనం కొట్టేసింది.
గతంలో సిసోడియా దాఖలు చేసిన రెండు వేర్వేరు బెయిల్ దరఖాస్తులపై అక్టోబర్ 17న తీర్పును రిజర్వ్ చేసిన న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, ఎస్వీఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం.. తాజాగా తీర్పును వెలువరించింది. ఈ కేసుకు సంబంధించిన కొన్ని ఆధారాలను ఈడీ తమకు అందించినట్లు కోర్టు తెలిపింది. లిక్కర్ స్కామ్‌లో రూ.338 కోట్ల నగదు బదిలీకి సంబంధించి ఈడీ కొన్ని ఆధారాలను చూపించినట్లు దేశ అత్యున్నత న్యాయస్థానం వెల్లడించింది. ఇక ఈ లిక్కర్ స్కామ్ కేసులో విచారణను పూర్తి చేసేందుకు ఈడీకి సుప్రీంకోర్టు 6 నుంచి 8 నెలల సమయం ఇచ్చింది. విచారణ నెమ్మదిగా సాగితే.. మూడు నెలల్లోపు సిసోడియా మళ్లీ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు అర్హత పొందుతారని సుప్రీం పేర్కొంది.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణంతో మనీష్ సిసోడియాకు సంబంధం ఉన్నట్లు ఆరోపణలు రావడంతో ఏడాదిన్నర క్రితం సీబీఐ, ఈడీ అధికారులు సిసోడియాను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. లిక్కర్ స్కామ్ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రెండూ విచారిస్తున్నాయి. ఈ క్రమంలో మనీష్ సిసోడియాను రెండు దర్యాప్తు సంస్థలకు చెందిన అధికారులూ ప్రశ్నిస్తున్నారు.
Also Read..
Kerala blasts | కేరళ వరుసపేలుళ్ల ఘటనలో 12 ఏళ్ల బాలిక మృతి.. 3కి చేరిన మరణాల సంఖ్య
Joe Biden | గాజాలోని పౌరులను రక్షించండి.. ఇజ్రాయెల్‌కు బైడెన్ సూచన
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

