‘విభిన్నమైన కథతో తెరకెక్కిన చిత్రం ‘మిస్టీరియస్’. ఇందులో క్రైమ్‌తోపాటు లవ్, క్రష్ అంశాలు కూడా ఉంటాయి. ఇప్పటివరకూ తెలుగుతెరపై రాని థ్రిల్లర్ ఇది ’ అని దర్శకుడు మహి కోమటిరెడ్డి అన్నారు. ఆయన దర్శకత్వంలో రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘మిస్టీరియస్’. రోహిత్, మేఘన రాజ్‌పుత్ జంటగా నటించారు. జయ్ పల్లందాస్ నిర్మాత. ఈ నెల 19న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మహి కోమటి రెడ్డి పైవిధంగా స్పందించారు.
ఇంకా చెబుతూ ‘ఇందులో చివరివరకూ కిల్లర్ ఎవరో ఊహించడం కష్టం. ఎవరూ ఊహించని ట్విస్ట్‌తో ైక్లెమాక్స్ ఉంటుంది. పాటలు కూడా కథలో ఇమిడిపోయి ఉంటాయి. నిర్మాత జయ్ పల్లందాస్ ఏ విషయంలోనూ రాజీపడలేదు. ఈ నెల 19న 150 థియేటర్లలో గ్రాండ్‌గా సినిమాను విడుదల చేస్తున్నాం’ అని తెలిపారు. అభిద్ భూషన్, రియా కపూర్, బాలరాజ్ వాడి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా, ఎడిటింగ్: పరవస్తు దేవేంద్రసూరి, నిర్మాణం: అశ్లీ క్రియేషన్స్.