టాలీవుడ్ (Tollywood)లో ఉన్న మోస్ట్ క్రేజీ కాంబినేషన్ లో ఒకటి మహేశ్ బాబు-త్రివిక్రమ్ (Mahesh Trivikram movie). ఈ ఇద్దరి కలయికలో సినిమా వస్తుందంటే క్రేజ్ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మాటల మాంత్రికుడు మరోసారి మహేశ్ బాబు (Mahesh Babu)తో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్ డేట్‌తో అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చాడు మహేశ్.
మోకాలు సర్జరీ (knee surgery) కోసం మహేశ్ దుబాయ్ టూర్లో ఉన్నాడు. సర్జరీ తర్వాత ట్విటర్ లో ఫొటో పోస్ట్ చేసి అదరిపోయే అప్ డేట్ అందించాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas), నిర్మాత నాగవంశీ, మ్యూజిక్ డైరెక్టర్ థమన్‌తో కలిసి దిగిన ఫొటోను ట్విటర్ లో షేర్ చేశాడు. ‘పనితో ఛిల్ అవుట్..టీంతో మధ్యాహ్నం..’ అంటూ మహేశ్ బాబు ట్వీట్ చేశాడు. వీరంతా కలిసి సినిమా ప్రొడక్షన్‌కు సంబంధించిన పనులపై చర్చించినట్టు తాజా ట్వీట్ తో తెలిసిపోతుంది.
Work and chill… productive afternoon with the team!! #TrivikramSrinivas @vamsi84 @MusicThaman #Dubai pic.twitter.com/F11xtEM0GW
— Mahesh Babu (@urstrulyMahesh) December 27, 2021
లేటెస్ట్ అప్ డేట్‌తో మహేశ్-త్రివిక్రమ్ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లేలా కనిపిస్తోంది. మొత్తానికి సర్కారు వారి పాట విడుదలవకముందే మరో సినిమా అప్ డేట్‌తో అభిమానుల్లో జోష్ నింపుతున్నాడు మహేశ్ బాబు.