టాలీవుడ్ (Tollywood)స్టార్ హీరోల్లో మోస్ట్ హ్యాండ్సమ్ హీరో ఎవరంటే వెంటనే గుర్తొచ్చే పేరు మహేశ్ బాబు (Mahesh Babu) . ఈ సూపర్ స్టార్ ఖాతాలో మరో అరుదైన రికార్డు పడిపోయింది. ఇటీవల చేపట్టిన రీసెర్చ్‌లో 2021 ప్రపంచంలోని మోస్ట్ హ్యాండ్సమ్ మెన్ టాప్-10 లిస్టు ( world Top 10 handsome men 2021)లో మహేశ్‌బాబు చోటు సంపాదించాడు. రీసెర్చ్ ప్రకారం మోస్ట్ హ్యాండ్సమ్ మెన్స్ లిస్టులో పదో ర్యాంకు అందుకున్నాడు మహేశ్‌బాబు.
ఇండియా మొత్తంలో మోస్ట్ హ్యాండ్సమ్ మెన్స్ జాబితాలో నంబర్ 2 స్థానంలో నిలిచాడు. ఈ అరుదైన రికార్డు సొంతం చేసుకున్న తొలి దక్షిణాది హీరోగా మహేశ్ బాబు నిలవడం విశేషం. ఈ జాబితాలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ (ప్రపంచం) మూడో స్థానంలో నిలువగా..ఇండియా మొత్తంలో నంబర్ 1గా నిలిచాడు. ది బ్యాట్ మ్యాన్ ఫేం రాబర్ట్ పాటిన్సన్ మొదటి స్థానంలో నిలిచాడు.