ఆంజనేయులు, సోలో, గీత గోవిందం చిత్రాలతో డైరెక్టర్ గా స్పెషల్ ఇమేజ్ సంపాదించుకున్నాడు పరశురాం పేట్ల (Parasuram Petla). ఈ క్రేజీ డైరెక్టర్ ప్రస్తుతం స్టార్ హీరో మహేశ్ బాబు (Mahesh Babu)తో సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) చేస్తున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 25న పరశురాం పుట్టినరోజు. ఈ సందర్భంగా టాలెంటెడ్ దర్శకుడికి శుభాకాంక్షలు తెలియజేశాడు మహేశ్‌బాబు. పరశురాం ఆయురారోగ్యాలతో ఎప్పుడూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్టు ట్వీట్ చేశాడు మహేశ్.
సినిమా షూటింగ్ లొకేషన్లో పరశురాంతో నవ్వుతూ దిగిన స్టిల్‌ను ట్విటర్లో షేర్ చేశాడు. ఈ ట్వీట్ ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. విజయ్ దేవరకొండ, రష్మిక కాంబినేషన్లో 2018లో గీతగోవిందం సినిమా తెరకెక్కించి ఇండస్ట్రీకి బ్లాక్ బాస్టర్ హిట్ అందించాడు పరశురాం. మూడేళ్ల తర్వాత మహేశ్‌బాబుతో సర్కారు వారి పాట చేస్తుండటంతో సినిమాపై అంచనాలు భారీగానే నెలకొన్నాయి.
Wishing our director @ParasuramPetla a very happy birthday! Health and happiness always! 😊 pic.twitter.com/VfRzAQfIVy
— Mahesh Babu (@urstrulyMahesh) December 25, 2021
సర్కారు వారి పాట చిత్రంలో (Keerthy suresh) ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. పోకిరి సినిమా ట్రాక్‌లో సర్కారు వారి పాట తెరకెక్కుతుందని ఇటీవలే ఓ అప్ డేట్ తెరపైకి రాగా..ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచేస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.