సినిమాలతో ఎంటర్టైన్ చేస్తూనే.. మరోవైపు వందలాది చిన్నారులకు అండగా నిలబడి సిల్వర్ స్క్రీన్ మీదే కాదు.. రియల్ లైఫ్‌లోనూ సూపర్ స్టార్ గా మారిపోయాడు మహేశ్ బాబు (Mahesh babu). ఈ స్టార్ యాక్టర్ ఫౌండేషన్ ద్వారా ఇటీవలే మరో చిన్నారికి గుండె ఆపరేషన్ చేయించి కోట్లాది మంది మనసు గెలుచుకున్నాడు. మహేశ్ బాబు సినిమాలతోనే కాదు.. బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా పాపులర్ అనే విషయం ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
ఈ టాలెంటెడ్ యాక్టర్ మౌంటెయిన్ డ్యూ (mountain dew) సాఫ్ట్ డ్రింక్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సాఫ్ట్ డ్రింక్‌కు సంబంధించి కొత్త యాడ్ తెరపైకి వచ్చింది. ఈ కమర్షియల్ యాడ్ స్టిల్స్ నెట్టింట హల్ చల్ చేస్తుండగా.. మహేశ్ బాబు లుక్ చూసిన అభిమానులు స్టన్ అవుతున్నారు. మహేశ్ రోజురోజుకీ మరింత యంగ్‌లా మారిపోతున్నాడంటూ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మహేశ్ బాబు ప్రస్తుతం రివర్స్ ఏజింగ్ మోడ్‌లో ఉన్నాడని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.
సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎస్ఎస్ఎంబీ 28లో నటిస్తున్నాడు మహేశ్ బాబు. ఇప్పటికే షూటింగ్ షురూ కాగా.. కొత్త షెడ్యూల్ షూటింగ్ అప్డేట్ రావాల్సి ఉంది. త్రివిక్రమ్ సినిమా పూర్తయ్యాక ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో ఎస్ఎస్ఎంబీ 29ను కూడా మొదలుపెట్టనున్నాడు మహేశ్. వరల్డ్ అడ్వెంచరస్ ప్రాజెక్ట్‌గా ఈ మూవీ ఉండబోతుంది.
మహేశ్ బాబు యాడ్ వీడియో వైరల్..
Read Also :
Virupaksha | విరూపాక్షలో సాయిధరమ్ తేజ్ రిస్కీ బైక్ స్టంట్.. గ్లింప్స్ వీడియో
Rao Ramesh | గెట్ రెడీ.. హీరోగా రావురమేశ్.. సినిమా వివరాలివే
RRR | ‘నాటు నాటు’ పాటకు పాక్ నటి డ్యాన్స్.. వీడియో వైరల్..!