మహేష్‌బాబు (Mahesh Babu) హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘సర్కారు వారి పాట’ (Sarkaru Vaari Paata). పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ కు అద్బుతమైన స్పందన వస్తోంది. ఫస్ట్ నోటీస్ పోస్టర్ మహేశ్ అభిమానులనే కాదు సాధారణ ప్రేక్షకులను కూడా చాలా బాగా ఇంప్రెస్ చేస్తోంది. విడుదల చేసిన 24 గంటల్లోనే పోస్టర్ కు 95, 600కు పైగా లైక్స్ రాగా..49వేలకు పైగా రీట్వీట్స్ వచ్చాయి. ఒక్క రోజులోనే ఇంత బాగా రెస్పాన్స్ వచ్చిన ఆల్ టైమ్ తెలుగు సినిమా పోస్టర్ గా నిలిచింది.
సర్కారు వారి పాట వచ్చే ఏడాది జనవరి 13న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. రైతు సమస్యలతో పాటు బ్యాంక్ కుంభకోణాల నేపథ్యంలో మూవీని తెరకెక్కిస్తున్నట్లు టాక్. ఈ చిత్రంలో కీర్తి సురేష్ ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తుండగా..వెన్నెల కిషోర్, సుబ్బరాజు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంగీత దర్శకుడు థమన్. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు.
Super🌟@urstrulyMahesh
— BA Raju's Team (@baraju_SuperHit) August 1, 2021
𝑺𝑬𝑻𝑺 𝑨 𝑵𝑬𝑾 𝑩𝑬𝑵𝑪𝑯 𝑴𝑨𝑹𝑲 #SVPFirstNotice Becomes the MOST LIKED & RETWEETED Poster of TFI on Twitter in 24hrs🔥
#SarkaruVaariPaata 🔔@KeerthyOfficial @ParasuramPetla @MusicThaman @madhie1 @MythriOfficial @GMBents @14ReelsPlus pic.twitter.com/5vkHL95MTH
ఇవి కూడా చదవండి..
‘ఎవరు మీలో కోటీశ్వరులు’ న్యూ ప్రోమో.. ఆగస్ట్ నుండి ప్రారంభం
దీపిక గర్భవతి అంటూ ప్రచారం.. వాస్తవమెంత?
అసిస్టెంట్ డైరెక్టర్ గా బిగ్ బాస్ బ్యూటీ
షూటింగ్స్ తో ఢిల్లీ భామ బిజీ షెడ్యూల్..!
తరుణ్, ఉదయ్‌కిరణ్‌తో నన్ను పోల్చొద్దు: వరుణ్ సందేశ్
ప్రియమణి-ముస్తఫారాజ్ వివాహం చెల్లదు..