ఓ వైపు సినిమాను షూట్ చేస్తూ.. మరోవైపు పబ్లిసిటీని కూడా కానిచ్చేస్తుంటారు మన మేకర్స్ అంతా. కానీ ఈ విషయంలో రాజమౌళి రూటే సపరేటు. ఒక్క ప్రమోషనల్ ఈవెంట్‌తో సినిమాకు ఎక్కడలేని హైప్‌ని తీసుకొచ్చేసి, ఇక ఏమాత్రం హడావిడి చేయకుండా సైలెంట్‌గా షూటింగ్ కానిచ్చేస్తున్నారు రాజమౌళి. ప్రస్తుతం హైదరాబాద్ ఆర్ఎఫ్సీలో ‘రాజమౌళి వారణాసి’ షూటింగ్ చడీచప్పుడూ లేకుండా జరిగిపోతున్నది.
దీనికోసం 50కోట్ల భారీ వ్యయంతో వారణాసి సెట్‌ని నిర్మించారు. గంగా ఘాట్లు, ఆలయాలు, నదీ తీరాలు, పురాతన నగర శిల్పకళ.. ఇవన్నీ అచ్చుగుద్దినట్టు, నిజంగా కాశీనే తలపించేలా ఈ సెట్‌ని నిర్మించారు. భారతీయ సినీ చరిత్రలో నిర్మించిన అత్యంత ఖరీదైన సెట్లలో ఇది ఒకటిగా నిలుస్తుందని మేకర్స్ చెబుతున్నారు. ఈ సెట్లో వారణాసి నేపథ్యంలో సాగే హై ఓల్టేజ్ యాక్షన్ సీన్స్ తీస్తున్నారట రాజమౌళి. ఇందులో ‘రుద్ర’గా మహేశ్‌బాబు నటిస్తున్న విషయం తెలిసిందే. ఆయనతోపాటు ప్రకాష్‌రాజ్ కూడా షూటింగ్లో పాల్గొంటున్నారట.
రాజమౌళి మార్క్ యాక్షన్ డిజైన్‌తో విజువల్ గ్రాండియర్‌గా ఈ సీన్స్ ఉంటాయని చెబుతున్నారు. ప్రియాంకచోప్రా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్న విషయం విదితమే. కేఎల్ నారాయణ, కార్తికేయ నిర్మిస్తున్న ఈ భారీ పానిండియా సినిమాకు ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు.