Mahesh Babu | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా.. నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ నిర్మించింది. గత నెల 27న విడుదలైన మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నది. విజువల్ వండర్‌గా తెరకెక్కిన ఈ మూవీపై ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. తాజాగా కల్కి సినిమా చూసిన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) సైతం ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.
‘కల్కి మూవీ అద్భుతంగా ఉంది.. జస్ట్ వావ్. నాగ్ అశ్విన్ విజన్‌కు హ్యాట్సాఫ్. ప్రతి ఫ్రేమ్ ఒక కళాఖండం. బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ స్క్రీన్ ప్రజెన్స్‌ను ఎవరూ మ్యాచ్ చేయలేరు. కమల్ హాసన్ ఏ పాత్ర పోషించినా దానికి ప్రత్యేకత తీసుకొస్తారు. ప్రభాస్ మరో గొప్ప క్యారెక్టర్లో చాలా సులభంగా నటించేశారు. దీపిక ఎప్పటిలాగే అద్భుతంగా కనిపించారు. ఇంతటి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న వైజయంతీ సంస్థకి, చిత్ర బృందానికి అభినందనలు’ అని మహేశ్ బాబు తన ట్వీట్లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. ఈ పోస్ట్‌కు దర్శకుడు నాగ్ అశ్విన్ స్పందించారు. ‘ధన్యవాదాలు సర్.. మీ అభినందనలు అందుకోవడం మా టీమ్‌కు ఆనందంగా ఉంది’ అంటూ రిప్లై ఇచ్చారు.
జూన్ 27 ప్రపంచవ్యా్ప్తంగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా దూసుకెళ్తోంది. ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటికే ఈ మూవీ రీసెంట్గా రూ.800 కోట్ల క్లబ్లో చేరినట్లు చిత్రయూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ రూ.900 కోట్ల క్లబ్లో ఎంటర్ అయ్యి రూ.1000 కోట్ల దిశగా దూసుకుపోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ చిత్రంలో బాలీవుడ్ భామలు దీపికా పదుకొణె, దిశా పటానీ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటించగా.. లెజెండరీ యాక్టర్లు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, రాజేంద్రప్రసాద్, పశుపతి ఇతర కీలక పాత్రలు పోషించారు. బెంగాలీ నటుడు శాశ్వత ఛటర్జీ విలన్‌గా నటించాడు.
@SrBachchan sir your towering screen presence is unmatched!!@ikamalhaasan sir every character you portray is uniquely yours! #Prabhas you have carried yet another magnum opus with ease. @deepikapadukone…amazing as always.
— Mahesh Babu (@urstrulyMahesh) July 8, 2024
Congratulations to @VyjayanthiFilms and the entire team on the phenomenal success 👏👏👏
— Mahesh Babu (@urstrulyMahesh) July 8, 2024
Thank you so much sir…this will mean so much to the whole team :)) 🙏🙏
— Nag Ashwin (@nagashwin7) July 8, 2024
Also Read..
Mumbai Rains | ముంబైకి భారీ వర్ష సూచన.. రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ.. పాఠశాలలకు సెలవు
Spirit | పాన్‌వరల్డ్ సూపర్‌స్టార్ ప్రభాస్.. స్పిరిట్ కోసం హాలీవుడ్ విలన్?
Priyanka Jawalkar | రాధిక 3.0గా ప్రియాంక జవాల్కర్? డీజే టిల్లుతో రొమాన్స్ చేయనున్న టాక్సీవాలా భామ!