Spirit | ప్రభాస్ ‘కల్కి 2898ఏడీ’ స్పీడ్ మామూలుగా లేదు. ఇప్పటికే వెయ్యికోట్ల మార్క్‌కు చేరవగా వచ్చేసింది. మరి ఈ వేగానికి బ్రేక్ ఎక్కడ పడుతుందో ఇప్పుడైతే ఎవరికీ క్లారిటీ లేదు. ఈ ప్రయాణంలో ఎన్ని రికార్డులు బద్దలవుతాయో కూడా చెప్పలేం. ఇప్పటికే పాన్ ఇండియా సూపర్‌స్టార్‌గా ఎదిగిన ప్రభాస్, ‘కల్కి 2898ఏడీ’ దెబ్బకి పాన్‌వరల్డ్ సూపర్‌స్టార్‌గా మారారని పలువురు అభిప్రాయపడుతున్నారు. అందుకేనేమో దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా తన ‘స్పిరిట్’ సినిమాను పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కించేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు.
ఈ సినిమా బడ్జెట్ మూడొందల కోట్ల పైనే అని తెలుస్తున్నది. టి.సిరీస్, భద్రకాళి ప్రొడక్షన్స్ కలిసి నిర్మించనున్న ఈ పాన్ వరల్డ్ సినిమాలో విలన్‌గా హాలీవుడ్ స్టార్ విలన్ లీ డాంగ్ సిక్‌ని తీసుకునేదుకు నిర్ణయించారట. అప్పుడే ఆయనతో సంప్రదింపులు కూడా మొదలయ్యాయని సమాచారం. ట్రైన్ టూ బూసాన్, మార్వెల్ సిరీస్ ఎటర్నల్ సినిమాల ద్వారా ఈ సౌత్ కొరియన్ యాక్టర్ ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమా కథ ఇంటర్నేషనల్ స్థాయిలో ఉంటుందట. అందుకే హాలీవుడ్ నటులపై దృష్టిసారించారు సందీప్‌రెడ్డి వంగా.
ఇందులో ప్రభాస్ రెండు భిన్న కోణాల్లో కనిపిస్తారట. అందులో ఒకటి రఫ్ అండ్ రగ్గడ్‌గా ఉంటే.. రెండోది ైస్టెలిష్‌గా ఉంటుందట. ఇందులో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్‌ఆఫీసర్‌గా కనిపిస్తారని గతంలో సందీప్‌రెడ్డి చెప్పారు. మరి ఈ రెండు గెటప్పుల్లో పోలీస్ గెటప్ దేనిదో తెలియాల్సివుంది. ఇందులో ప్రభాస్ది డ్యూయెల్ రోలా? లేక ఒకే పాత్రలో రెండు పార్శాలుంటాయా? అనే విషయంలో కూడా క్లారిటీ రావాల్సివుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లో సెట్స్‌కి వెళ్లే అవకాశం ఉంది.