Angkrish Raghuvanshi : ఐపీఎల్లో మెరుపు ఇన్నింగ్స్‌లతో అలరించే అంగ్క్రిష్ రఘువంశీ (Angkrish Raghuvanshi ) అనుకోకుండా ఆస్పత్రి పాలయ్యాడు. దేశవాళీ టోర్నీలో ఆడుతూ గాయపడడంతో అతడిని దవాఖానకు తీసుకెళ్లారు. విజయ్ హజారే ట్రోఫీ(Vijay Hazare Trophy)లో ముంబై తరఫున బరిలోకి దిగిన అంగ్క్రిష్ శుక్రవారం ఉత్తరాఖండ్‌తో మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా గాయపడ్డాడు. నడలేని స్థితిలో ఉన్న అతడిని స్ట్రెచర్ మీద బయటకు తీసుకొచ్చి.. సమీపంలోని ఎస్డీఎంహెచ్ ఆస్పత్రిలో చేర్పించారు.
వన్డే ఫార్మాట్లో జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో ముంబైకి అంగ్క్రిష్ రఘువంశీ ఆడుతున్నాడు. జైపూర్‌లో శుక్రవారం ఉత్తరాఖండ్‌పై 11 పరుగులతో నిరాశపరిచిన అతడు.. ఫీల్డింగ్‌లో కష్టమైన క్యాచ్ అందుకునే క్రమంలో గాయపడ్డాడు. ఎలాగైనా బంతిని ఒడిసిపట్టేందుకు ప్రయత్నించిన ఈ యువకెరటం తల, భుజాలకు గాయాలయ్యాయి. దాంతో.. నొప్పితో మైదానంలోనే కూలబడిన అతడిని ఫిజియో వచ్చి పరీక్షించాడు.
Angkrish Raghuvanshi injured pic.twitter.com/98cZulfUYY
— Rohit Kumar (@Rk2751) December 26, 2025
అయినా పరిస్థితి మెరుగవ్వకపోవడంతో సిబ్బంది స్ట్రెచర్ మీద అంగ్‌క్రిష్‌ను బయటకు తీసుకెళ్లారు. అనంతరం.. ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని సమాచారం. ఐపీఎల్లో కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటింగ్ అస్త్రంగా పేరొందిన అంగ్క్రిష్ టాపార్డర్ బ్యాటర్. ఇప్పటివరకూ రెండు సీజన్లలో 22 మ్యాచులు ఆడిన ఈ చిచ్చరపిడుగు 463 పరుగులు సాధించాడు.