Anasuya | సోషల్ మీడియాతో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీలో శివాజీ చేసిన వ్యాఖ్యలపై రచ్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ వివాదంలో కొంతమంది శివాజీకి మద్దతు తెలుపుతుండగా, మరికొందరు ఆయన ఉద్దేశం సరైనదే అయినా వాడిన పదాలు సరిగ్గా లేవని విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ శివాజీ వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించారు. మహిళలు దుస్తులు ఎలా వేసుకోవాలన్నదానిపై మాట్లాడిన శివాజీ, వంకరచూపులతో చూసే మగాళ్లపై ఎందుకు మాట్లాడలేదని ఆమె కౌంటర్ వేశారు. అలాగే సానుభూతి కోసం ప్రయత్నాలు చేస్తున్నారంటూ శివాజీపై అనసూయ మండిపడ్డారు. తనకు ఏదైనా జరిగితే భర్త, కుటుంబం, స్నేహితులు ఉన్నారని, ఇతరుల సానుభూతి అవసరం లేదని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా తాజాగా అనసూయ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ట్రెడిషనల్ సారీ లుక్ నెట్టింట వైరల్‌గా మారింది. బ్లూ కలర్ సారీతో సంప్రదాయంగా కనిపించిన అనసూయ ఫోటోలపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. తరచూ బోల్డ్ ఫోటోలు షేర్ చేసే అనసూయ, ఈసారి సాంప్రదాయ లుక్‌లో కనిపించడంపై కొందరు ఫన్నీ కామెంట్స్ చేస్తూ, “శివాజీ ఎఫెక్ట్” అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు. అయితే సారీ లుక్ తర్వాత అనసూయకి చాలా మంది కౌంటర్స్ వేస్తున్న నేపథ్యంలో స్విమ్ షూట్ వీడియోని షేర్ చేసి తగ్గేదే లే అన్నట్టు బదులిచ్చింది. నీళ్లలో ఉన్నప్పుడు నేను చాలా సంతోషంగా ఉంటాను. నా ట్రావెల్ డేస్ ని చాలా మిస్ అవుతున్నాను. త్వరలోనే ఒక హాలిడే ప్లాన్ చేయాలి” అని అనసూయ ఇన్స్టాగ్రామ్ లో పాత వీడియోని షేర్ చేసింది.
తనని ట్రోల్ చేస్తున్నారు కాబట్టే, ఆమె కావాలనే ఇలా స్విమ్ షూట్ లో ఉన్న వీడియోని పోస్ట్ చేసిందని నెటిజన్లు భావిస్తున్నారు. మరోవైపు కొంతమంది నెటిజన్లు అనసూయపై విమర్శలు గుప్పిస్తున్నారు. శరీరం కనిపించేలా దుస్తులు వేసుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, శివాజీ హీరోయిన్ల గురించి మాట్లాడారని, యాంకర్ల గురించి కాదంటూ పంచ్‌లు వేస్తున్నారు. అయితే గతంలోనే అనసూయ, తన కొడుకు చెప్పితేనే బోల్డ్ డ్రెస్సుల విషయంలో వెనక్కి తగ్గుతానని, ఇతరులు చెప్పినంత మాత్రాన తన ఛాయిస్ మార్చుకోనని స్పష్టం చేశారు. మొత్తానికి శివాజీ వ్యాఖ్యలతో మొదలైన వివాదం, ఇప్పుడు అనసూయ సారీ లుక్‌తో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.