Magizh Thirumeni | కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajithkumar) బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. వీటిలో ఒకటి విదాముయార్చి (VidaaMuyarchi). మగిజ్ తిరుమేని దర్శకత్వంలో ఏకే 62గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో త్రిష (Trisha) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ మూవీలో కోలీవుడ్ నటుడు ఆరవ్ కీలక పాత్రలో నటిస్తున్నాడని తెలిసిందే. తాజాగా మేకర్స్ ఆరవ్ లుక్‌ను విడుదల చేశారు.
స్టైలిష్ గాగుల్స్ పెట్టుకున్న ఆరవ్ ఓ ట్రక్కులో నుంచి దిగుతున్నాడు ఆరవ్. ఈ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించి ఈ చిత్రం నుంచి ఇటీవలే యాక్షన్ కింగ్ అర్జున్ సార్జా కీలక పాత్రలో నటిస్తున్నాడని తెలిసిందే. అర్జున్ స్టైలిష్ లుక్‌లో రోడ్డుపై నిలబడి ఉన్న లుక్ నెట్టింట వైరల్ అవుతోంది.
లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడని తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ (Sanjaydutt) విలన్‌గా నటిస్తున్నాడు. అజిత్ కుమార్ మరోవైపు అధిక్ రవిచంద్రన్ డైరెక్షన్లో నటిస్తోన్న ఏకే 63 కూడా లైన్లో పెట్టాడు. గుడ్ బ్యాడ్ అగ్లీ టైటిల్‌తో రానున్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.
Presenting the look of actor @Aravoffl 🌟 from VIDAAMUYARCHI. 💥 Embracing the spirit of persistence! 💪#VidaaMuyarchi #EffortsNeverFail#AjithKumar #MagizhThirumeni @LycaProductions #Subaskaran @gkmtamilkumaran @trishtrashers @akarjunofficial @anirudhofficial @Aravoffl… pic.twitter.com/rGfwbWWsa7
— Lyca Productions (@LycaProductions) August 9, 2024
NTR Neel | లాంఛింగ్ రోజే విడుదల తేదీ ఫైనల్.. ఎన్టీఆర్ 31 థియేటర్లకు వచ్చే టైం ఇదే
Mahesh Babu | మహేశ్ బాబు బర్త్ డే స్పెషల్.. క్యూరియాసిటీ పెంచుతున్న కొత్త లుక్
Mangalavaaram | మరో భాషలో పాయల్ రాజ్‌పుత్ మంగళవారం.. ఏ ప్లాట్ఫాంలోనంటే!
Sai Pallavi | ఆన్ డ్యూటీ.. సాయిపల్లవి ఇప్పుడెక్కడుందో తెలుసా..?