Reviews | థియేటర్ల ముందు యూట్యూబ్ ఛానళ్లు, కొందరు నెటిజన్లు హడావుడి రివ్యూలు (Reviews)లు ఇవ్వడం ఎక్కువైపోయిందని.. ఇది సినిమాల ఫలితాలపై ప్రభావం చూపిస్తుందని మిళ్ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (TFAPA) అభిప్రాయపడిన విషయం తెలిసిందే. అయితే ఇలాంటి రివ్యూలను నిలిపేయడంలో భాగంగా.. సినిమా సమీక్ష పేరుతో వ్యక్తిగత దాడులు, విద్వేషాలను రెచ్చగొట్టడాన్ని ఖండిస్తూ TFAPA సుదీర్ఘ సందేశాన్ని కూడా అందరితో పంచుకుంది.
కాగా పెద్ద సినిమా థియేటర్లలోకి వచ్చినప్పుడల్లా టార్గెట్ చేసి సోషల్ మీడియా ట్రోలింగ్స్ చేయడాన్ని నియంత్రించాలని టీఎఫ్ఏపీఏ మద్రాస్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. మూవీ రివ్యూలపై సినిమా విడుదలైన మొదటి 3 రోజులు నిషేధం విధించడంతోపాటు ఆన్లైన్ ఫిలిం క్రిటిక్స్‌పై మార్గదర్శకాలు రూపొందించాలని కేంద్ర సమాచార, ప్రసార శాఖతోపాటు సమాచార సాంకేతిక, డిజిటల్ సేవల విభాగాలకు మార్గనిర్దేశకత్వం చేయాలని పిటిషన్లో కోరారు నిర్మాతలు. అయితే జస్టిస్ ఎస్ సౌంథర్తో కూడిన ధర్మాసనం రిట్ పిటిషన్‌పై ఇవాళ్టి విచారణను తిరస్కరించింది.
చాలా సినిమాలపై ప్రభావం..
రివ్యూలు ఈ ఏడాది విడుదలైన చాలా సినిమాలపై ప్రభావం చూపించాయని ఇప్పటికే నిర్మాతలు పేర్కొన్నారు. ప్రముఖంగా ఇండియన్ 2, వెట్టైయాన్, కంగువపై పబ్లిక్ టాక్, యూట్యూబ్ ఛానెళ్లు ఇచ్చే విశ్లేషణలు ఎంతో ప్రభావం చూపించాయి.
సినీ పరిశ్రమకు తలనొప్పిగా మారుతున్న ఈ సమస్యను నివారించేందుకు అన్ని సంఘాలు కలిసి రావాలి. థియేటర్ యజమానులు యూట్యూబ్ ఛానెళ్లను సినిమా థియేటర్ల ప్రాంగణంలోకి అనుమతించకూడదు. రివ్యూల పేరుతో నటీనటులు, దర్శకనిర్మాతలపై వ్యక్తిగత విమర్శలను ఖండిస్తున్నాం. ఇకపై ఇలాంటివి చేస్తే ఒప్పుకునేది లేదని TFAPA హెచ్చరికలు కూడా జారీ చేసింది.
TamilProducers Association files a writ petition in Madras HC seeking a 3-day ban on movie reviews on social media post-release to Protect theatrical business.
#MovieReviews | #TFAPA pic.twitter.com/nhHBn8Gv3M
— Suresh (@isureshofficial) December 3, 2024
Rishab Shetty | శివాజీ మహారాజ్‌గా కాంతార హీరో.. రిషబ్ శెట్టి స్టన్నింగ్ లుక్ వైరల్
Allu Arjun | ఐదేళ్ల నుంచి ఒకే హీరోయిన్ : పుష్ప 2 ది రూల్ ఈవెంట్లో అల్లు అర్జున్