Mad Square | సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్ లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం మ్యాడ్ (Mad). యూత్ ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ మూవీకి సీక్వెల్ మ్యాడ్ స్క్వేర్ (Mad 2) వస్తుందని తెలిసిందే. మేకర్స్ ముందుగా ప్రకటించిన ప్రకారం ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఫస్ట్ లుక్‌లో సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్ చొక్కా, లుంగీలో స్టైలిష్‌గా కనిపిస్తూ..బాయ్స్ మ్యాడ్ మ్యాక్స్ ఎంటర్టైన్మెంట్తో తిరిగొస్తున్నట్టు ఫస్ట్ లుక్ చెప్పకనే చెబుతోంది.
ఈ మూవీ ఫస్ట్ సింగిల్‌ను సెప్టెంబర్ 20న విడుదల చేస్తున్నట్టు తెలియజేశారు. సీక్వెల్‌కు కూడా కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తుండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఫస్ట్ పార్టులోశ్రీగౌరి ప్రియా రెడ్డి, అనంతికా సనిల్‌కుమార్, గోపికా ఉద్యన్ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటించగా.. మరి సీక్వెల్లో ఎవరెవరు సందడి చేయబోతున్నారనేది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది.
ఈ చిత్రాన్ని నాగవంశీ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై హారికా సూర్యదేవర, సాయి సౌజన్య సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నాడు.
Here’s the First Look of #MADSquare 🕺
First single coming out on 20th September 🤩🔥#ThisTimeItsMADMAXX 💥 pic.twitter.com/MApln4Eb0S
— BA Raju’s Team (@baraju_SuperHit) September 18, 2024
Vetrimaaran | వెట్రిమారన్ విడుదల పార్ట్ 2 షూట్ టైం.. ఏ సీన్లు చిత్రీకరిస్తున్నారో తెలుసా..?
UI The Movie | మేకింగ్‌లో హిస్టరీ.. స్టన్నింగ్‌గా ఉపేంద్ర యూఐ లుక్
Jr NTR | మనం భాషాపరంగా మాత్రమే విభజించబడ్డాం.. తారక్ కామెంట్స్ వైరల్