Macherla Niyojakavargam Latest Update | ఫలితంతో సంబంధంలేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంటాడు నితిన్. గతేడాది ఏకంగా మూడు సినిమాలతో సినీఅభిమానులను పలకరించాడు. అయితే అందులో ఏ ఒక్కటి కూడా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వలేదు. దాంతో నితిన్ ఆశలన్ని ‘మాచర్ల నియోజకవర్గం’ పైనే ఉన్నాయి.ప్రముఖ ఎడిటర్ ఎమ్.ఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతూ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. మొదటి సారిగా నితిన్ పూర్తి స్థాయి మాస్ యాక్షన్ చిత్రంలో నటించాడు. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన ప్రచార చిత్రాలు, గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేసాయి. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 12న విడుదల కానుంది. ఈ క్రమంలో మేకర్స్ వరుసగా అప్డేట్లను ప్రకటిస్తూ ప్రేక్షకులలో క్యూరియాసిటిని పెంచుతున్నారు. తాజాగా చిత్రబృందం మరో అప్డేట్ను ప్రకటించింది.
మాచర్ల నియోజకవర్గం యాక్షన్ గ్లింప్స్‌ను రేపు ఉదయం 11.03 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు నితిన్ సోషల్ మీడియాలో ప్రకటించాడు. ఈ చిత్రంలో నితిన్ గుంటూరు జిల్లా కలెక్టర్‌గా కనిపించనున్నాడు. కృతిశెట్టి, క్యాథెరీన్ థ్రెసా హీరోయిన్లుగా నటించారు. ఆదిత్య మూవీస్ &ఎంటర్టైనమెంట్స్, శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్లపై ఎన్.సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి స్వరాలను సమకూర్చాడు. ఇప్పటికే విడుదలైన ‘రా రా రెడ్డి’ యూట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఇక మాచర్ల నియోజకవర్గం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జూలై 30న జరుపగనున్న విషయం తెలిసిందే.
Tom at 11.03 a.m #Macherlaniyojakavargam pic.twitter.com/dq4pISUdy1
— nithiin (@actor_nithiin) July 25, 2022
Read Also:
NBK 107 | అభిమానితో కలిసి భోజనం చేసిన బాలకృష్ణ.. వైరల్ అవుతున్న వీడియో
Chiranjeevi | కైకాలతో కేక్ కట్ చేయించిన చిరు.. వైరల్ అవుతున్న ఫోటోలు
Sir Movie | ధనుష్ మూవీ నుండి క్రేజీ అప్డేట్లు.. జోష్‌లో ఫ్యాన్స్