Sita Ramam | ‘నాలుగు మాటలు పోగేసి ఉత్తరం రాస్తే కాశ్మీర్‌ను మంచుకు వదిలేసి వస్తారా’.. ఆసక్తి రేకెత్తిస్తున్న ‘సీతారామం’ ట్రైలర్
Sita Ramam Trailer | ‘ఓకే బంగారం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు దుల్కర్ సల్మాన్. ఆ తర్వాత ‘మహానటి’లో జెమిని గణేషన్ పాత్ర పోషించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. చేసింది నెగిటీవ్ షేడ్స్ ఉన్న పాత్రే అయినా ఇక్కడ వారికి ఫేవరెట్ నటుడిగా మారిపోయాడు. ప్రస్తుతం ఈయన నేరుగా తెలుగులోనే ‘సీతారామం’ అనే ప్రేమకథా చిత్రంలో నటించాడు. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రష్మిక కీలకపాత్రలో నటించింది. ఈ చిత్రం ఆగస్టు 5న విడుదల కానుంది. ఈక్రమంలో మేకర్స్ వరుస అప్డేట్లను ప్రకటిస్తున్నారు. తాజాగా చిత్రబృందం ‘సీతారామం’ ట్రైలర్‌ను విడుదల చేశారు.
‘ఇరవై ఏండ్ల క్రీతం లెఫ్టినెంట్ రామ్ నాకొక బాధ్యత అప్పగించాడు. ఈ ఉత్తరం సీతామహాలక్ష్మికి నువ్వే చేర్చాలని’ అంటూ ట్రైలర్ మొదలైంది. రష్మిక మందన్న, తరుణ్‌భాస్కర్ సీత జాడ కోసం పడిన పాట్లు అలరిస్తున్నాయి. ‘దీంట్లో సీత పేరే లేదు. సీతను ఎలా పట్టుకోవాలి నాకింక పది రోజులే టైమ్ ఉంది. రామ్ గురించి తెలిస్తే సీతను పట్టుకోవడం ఈజీ’ అంటూ రష్మిక పలికే సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. మరి సీత జాడ రష్మిక కనిపెట్టిందా? లేదా? అనేది సినిమా చూస్తే తెలుస్తుంది. ‘నాలుగు మాటలు పోగేసి ఉత్తరం రాస్తే కాశ్మీర్‌ను మంచుకు వదిలేసి వస్తారా’ ‘నా పాటికి నేను అనాదలా బ్రతికేస్తే ఉత్తరాలు రాసి ఇబ్బంది పెట్టిందే కాక.. దారి ఖర్చులిస్తాననడం న్యాయమా’ అంటూ హీరో హీరోయిన్లు పలికే సంభాషణలు సినిమాపై విపరీతమైన క్యూరియాసిటీని పెంచుతున్నాయి.
రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో దుల్కర్ లెఫ్టినెంట్ రామ్ పాత్రలో నటించాడు. మృనాళ్ థాకూర్ సీతా మహాలక్ష్మి పాత్రలో నటించింది. రష్మిక మందన్న కాశ్మీర్ ముస్లిం అమ్మాయిగా కనిపించనుంది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్-స్వప్న సినిమాస్ బ్యానర్లపై అశ్వినీదత్, స్వప్న దత్ నిర్మించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

