Sir Movie | ధనుష్ మూవీ నుండి క్రేజీ అప్డేట్లు.. జోష్‌లో ఫ్యాన్స్
Dhanush-Venky Atluri’s ‘Sir’ Movie Latest Updates | తమిళ హీరో ధనుష్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఈయన నటించిన సినిమాలు తెలుగు డబ్బింగ్లో అడపా దడపాగా విడుదలవుతూ ఉండేవి. అయితే ‘రఘువరన్ B-Tech’ ధనుష్‌కు టాలీవుడ్లో మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఇక చిత్రం తర్వాత ఈయన నటించిన సినిమాలన్ని తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతున్నాయి. ప్రస్తుతం ధనుష్ ఐదు సినిమాలను లైన్లో పెట్టాడు. అందులో ‘సర్’ సినిమా ఒకటి. ద్విభాష చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ‘రంగ్‌దే’ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుండి మేకర్స్ రెండు బిగ్ అప్డేట్లను ప్రకటించారు.
ఈ చిత్రంలోని ధనుష్ ఫస్ట్‌లుక్‌ను జూలై 27న.. టీజర్‌ను జూలై 28న విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియాలో పోస్టర్‌ను విడుదల చేశారు. ఇలా రెండు అప్డేట్లు ఒక రోజు వ్యవధిలోనే రావడంతో ధనుష్ అభిమానులు ఖుషి అవుతున్నారు. యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ధనుష్‌కు జోడీగా సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తుంది. జీవి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైనమెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం ధనుష్ నటించిన ‘తిరుచిత్రంబలం’, ‘నానే వరువన్’ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇక ఈయన నటించిన హాలీవుడ్ చిత్రం ‘ది గ్రే మ్యాన్’ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది.
#Vaathi #Sir pic.twitter.com/UzrDY0Nkmx
— Dhanush (@dhanushkraja) July 25, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

