Kaithi 2 | కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ (lokesh kanagaraj) తన నెక్ట్స్ చిత్రాన్ని అల్లు అర్జున్‌తో చేస్తున్న్టట్టు ప్రకటించాడని తెలిసిందే. AA23గా ఈ చిత్రం రానుంది. కాగా మరోవైపు కార్తీ టైటిల్ రోల్ పోషించిన బ్లాక్ బస్టర్ ఖైదీ చిత్రానికి సీక్వెల్ ఖైదీ 2 అప్డేట్ ఇప్పటికే రావాల్సి ఉండగా.. ఈ మూవీ అటకెక్కినట్టేనంటూ ఊహాగానాలు తెరపైకి వచ్చాయి.
మూవీ లవర్స్‌తోపాటు కార్తీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఖైదీ 2 (Kaithi2) అఫీషియల్ అప్డేట్ వచ్చేసింది. డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ (lokesh kanagaraj) ఇటీవలే మీడియాతో చిట్ చాట్ సెషన్లో ఖైదీ 2 గురించి క్లారిటీ ఇచ్చేశాడు. AA23 తర్వాత చేయబోయే సినిమా ఇదేనని చెప్పాడు. కమల్ హాసన్, రజినీకాంత్‌తో సినిమా చేయాల్సి ఉండగా.. కథ విషయంలో తేడాలు రావడంతో వర్కవుట్ కాలేదు. అంతేకాదు అదే సమయంలో కార్తీ వేరే సినిమాకు కమిట్ మెంట్ ఇవ్వడంతో డేట్స్ కారణంగా ఖైదీ 2ను సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు సాధ్యం కాలేదన్నాడు.
లోకేశ్ కనగరాజ్ అనుకున్న ప్లాన్ ప్రకారం అన్నీ అనుకున్నట్టుగా కుదిరితే ఈ చిత్రం 2027లో సెట్స్‌పైకి వెళ్లనుందని ఇన్సైడ్ టాక్. అంతేకాదు సూర్యతో చేయబోయే స్టాండలోన్ రోలెక్స్ సినిమా కూడా లోకేశ్ కనగరాజ్ లైనప్‌లో ఉంది.
Patang Movie | ఓటీటీలోకి యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘పతంగ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.!
MK Stalin | హిందీకి తమిళనాడులో స్థానం లేదు.. భవిష్యత్తులోనూ ఉండబోదు : సీఎం స్టాలిన్
Nayanthara | మమ్ముట్టి-మోహన్‌లాల్ ‘పేట్రియాట్’ నుంచి నయనతార ఫస్ట్ లుక్ రిలీజ్