Lokesh Kanagaraj | కోలీవుడ్ స్టార్ యాక్టర్ దళపతి విజయ్ (Thalapathy Vijay)టైటిల్ రోల్లో నటిస్తోన్న సినిమా జన నాయగన్ (Jana Nayagan). కార్తీ (ఖాకీ) ఫేం హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్నఈ మూవీ తెలుగులో జన నాయకుడు టైటిల్‌తో వస్తోంది.
ఈ మూవీ జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కావాల్సి ఉండగా.. సెన్సార్ బోర్డ్ సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వకపోవడంతో విజయ్ టీం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో జననాయగన్ ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందా..? అంటూ తెగ చర్చించుకుంటున్నారు అభిమానులు, సినీ జనాలు.
రిలీజ్ డేట్‌పై డైలామా కొనసాగుతుంటే ఆసక్తికర వార్త ఒకటి అభిమానులు, మూవీ లవర్స్‌లో జోష్ నింపుతోంది. ఈ మూవీలో స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ కీలక పాత్రలో నటిస్తున్నాడని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై క్లారిటీ ఇచ్చేశాడు లోకేశ్ కనగరాజ్. జయ నాయగన్లో కామియో గురించి మాట్లాడుతూ.. అవును.. సినిమాలో నేను కామియో రోల్ చేశాను. ఒక రోజు వినోథ్ అన్న, విజయ్ అన్న నాకు కాల్ చేసి అడగడంతో ఒకే చెప్పాను. ప్రస్తుతానికి చెప్పగలిగింది ఇంతేనన్నాడు. ఇప్పుడీ కామెంట్స్ నెట్టింట సూపర్ హైప్ క్రియేట్ చేస్తున్నాయి.
ఇప్పటికే విడుదల చేసిన జననాయగన్ ఫస్ట్ లుక్, ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. ఈ మూవీకి అనిరుధ్ సంగీతం అందిస్తుండగా.. కన్నడ టాప్ బ్యానర్ కేవీఎన్ ప్రోడక్షన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీ రోల్లో కనిపించనున్నారు. మమితా బైజు, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, నరైన్, ప్రియమణి ఇతర కీలక పాత్రల్లో నటించారు.
Patang Movie | ఓటీటీలోకి యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘పతంగ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.!
MK Stalin | హిందీకి తమిళనాడులో స్థానం లేదు.. భవిష్యత్తులోనూ ఉండబోదు : సీఎం స్టాలిన్
Nayanthara | మమ్ముట్టి-మోహన్‌లాల్ ‘పేట్రియాట్’ నుంచి నయనతార ఫస్ట్ లుక్ రిలీజ్