Lokesh Kanagaraj | కోలీవుడ్ స్టార్ యాక్టర్ విజయ్ (Vijay) నటిస్తోన్న తాజా చిత్రం ది గోట్ (The Greatest Of All Time). వెంకట్ ప్రభు (Venkat Prabhu) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో డ్యుయల్ రోల్లో నటిస్తున్నాడు. సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.
మరికొన్ని గంటల్లో సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ది గోట్ టీంకు డైరెక్టర్లు అట్లీ, లోకేశ్ కనగరాజ్ శుభాకాంక్షలు తెలిపారు. ది గోట్ యాక్టర్ విజయ్‌కు నా శుభాకాంక్షలు. వెంకట్ ప్రభు, ఏజీఎస్ ప్రొడక్షన్స్, అర్చనా కల్పతి అండ్ మూవీ టీం మంచి విజయాన్ని అందించాలని మీ బాయ్స్ అట్లీ, లోకేశ్ కనగరాజ్ కోరుకుంటున్నారని లోకేశ్ కనగరాజ్ ట్వీట్ చేశాడు. యాక్టర్ విజయ్ అన్న ది గోట్ బ్లాక్ బస్టర్ అవ్వాలన కోరుకుంటున్నానని అట్లీ రీట్వీట్ చేశాడు.
పొలిటికల్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తుండగా.. ప్రేమలు ఫేం మమితా బైజు కీలక పాత్రలో నటిస్తోంది. ఈ మూవీలో ప్రశాంత్, ప్రభుదేవా, స్నేహ, లైలా, యోగిబాబు మిక్ మోహన్, జయరాం, వీటీవీ గణేశ్, అజ్మల్ అమీర్, మనోబాల ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ బ్యానర్‌పై తెరకెక్కిస్తుండగా.. యువన్ శంకర్ రాజా మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.
Congratulations for the Blockbuster Goat
From your boys @actorvijay Anna https://t.co/gLtUsGiDGl— atlee (@Atlee_dir) September 4, 2024