వైవిధ్యమైన సినిమాలతో ఆకట్టుకునే నానికి మాస్ సినిమాలంటే చాలా ఇష్టం. ఫ్యామిలీ ఎంటర్టైనర్లు, లవ్‌స్టోరీస్ చేసే నాని ఈ మధ్య ఎక్కువగా మాస్ సినిమాల వైపే మొగ్గు చూపుతున్నాడు. నాని మాస్ ఇమేజ్ కోసం చేసిన సినిమాలు వీ, శ్యామ్ సింగరాయ్, దసరా ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద యావరేజీగా నిలబడిన నానికి పెద్దగా మాస్ ఇమేజ్ను ఇవ్వలేకపోయాయి. అందుకే నాని తన మాస్ దాహర్తిని తీర్చుకోవడం కోసం చేసిన మరో ప్రయత్నమే సరిపోదా శనివారం.
మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా వివేక్ ఆత్రేయ చేసిన కథలో నాని సూర్యగా ఓ మాస్ అవతార్‌లో కనిపించాడు. తనలో వున్న కోపాన్ని వారానికి ఒకసారి ప్రదర్శించే యువకుడి పాత్రలో నాని ఈ సినిమాలో కనిపించాడు. అయితే ఈ చిత్రంలో వివేక్ ఆత్రేయ నాని కోసం పుష్కలంగా యాక్షన్ ఏపిపోడ్స్ చిత్రీకరించాడు. అంతేకాదు కొంత మందికి ఇది మితిమీరిన హింసలా కనిపించింది. అయితే ఈ సినిమాలో లాజిక్లను దర్శకుడు వివేక్ పెద్దగా పట్టించుకోలేదు.
సినిమాలో హైదరాబాద్‌లోనే సోకులపాలెం అనే ఒక ఏరియా వున్నట్లుగా క్రియేట్చేసి.. ఆ ఏరియాలో ప్రజలు అత్యంత దుర్భర పరిస్థితుల్లో.. చేతకాని వాళ్లుగా.. ఒక సిఐ చేతులో ఆ ఏరియా ప్రజలు నలిగిపోతున్నట్లుగా చూపించాడు. అంతేకాదు అక్కడి ప్రజలను ఒక రాజు తరహాలో సిఐ హింసిస్తున్నట్లుగా చూపించడం సహజత్వానికి చాలా దూరంగా వుంది. ఎందుకంటే కథ కూడా ప్రజెంట్ టైమ్‌లో నడుస్తున్నట్లుగానే చూపిస్తూ.. ఇంకా ఈ రోజుల్లో హైదరాబాద్ లాంటి ఏరియాలో అలాంటి అకృత్యాలు జరుగుతున్నాయని చూపించడం నిజంగా రియల్స్టిక్గా లేదు.
కనీసం ఈ కథను పిరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో ఒక 30 ఏళ్ల క్రింద జరుగుతున్నట్లుగా చూపించినా ఇలాంటి విమర్శలు వచ్చేవి కావు.. అయితే ఇప్పుడు సినిమా చూసిన వాళ్లంతా ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి సినిమా తెరకెక్కిస్తున్న వివేక్ ఇదేం లాజిక్ బాసూ, సినిమా కథ విని ఒకే చేసినప్పుడు హీరో నాని అయినా ఇలాంటి మెయిన్ మిస్టేక్స్ చూసుకోవాలి కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు విమర్శకులు.
Read Also
Swag Teaser | శ్రీ విష్ణు వన్ మ్యాన్ షో.. ఆకట్టుకుంటున్న ‘స్వాగ్’ టీజర్