Little Hearts Director | లిటిల్ హర్ట్స్ సినిమాతో డైరెక్టర్‌గా మంచి బ్రేక్ అందుకున్నాడు సాయి మార్తాండ్. చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. ఈ సినిమా విడుదల చాలా రోజులవుతున్న సాయి మార్తాండ్ కొత్త ప్రాజెక్టును ప్రకటించలేదు. చాలా వార్తలు తెరపైకి వస్తున్నా ఎలాంటి ప్రకటన కూడా చేయలేదు. ఫైనల్‌గా తన రెండో సినిమాపై క్లారిటీ ఇచ్చేశాడీ యువ దర్శకుడు. ఈ సారి ఏకంగా అడివి శేష్‌తో సినిమా చేయబోతున్నాడు.
ప్రస్తుతం డెకాయిట్ షూట్‌తో బిజీగా ఉన్న అడివి శేష్‌కు సాయి మార్తాండ్ కథ, కథనాన్ని వివరించాడు. అన్నీ అనుకున్నట్టుగా కుదిరితే ఈ చిత్ మే 2026లో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఆసక్తికర విషయమేంటంటే ఈ చిత్రాన్ని లీడింగ్ యాక్టర్ జగపతి బాబు నిర్మించబోతుండటం. ఈ చిత్రాన్ని ఏసియన్ సునీల్ నారంగ్ కలిసి తెరకెక్కించనున్నాడు.
సాయి మార్తాండ్ బ్రో మీకు హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మా మధ్య లవ్లీ సంభాషణ జరిగింది. ఈ ప్రపంచంలో మీరనుకున్న అన్నీ సంతోషాలను పొందుతారు. సోదరా అమితమైన ప్రేమతో..అంటూ సాయి మార్తాండ్‌తో కలిసి దిగిన ఫొటోను ఎక్స్‌లో పోస్ట్ చేశాడు అడివిశేష్. ఈ ఇద్దరి కాంబోలో ఎలాంటి సినిమా రాబోతుందని ఆసక్తికరంగా మారింది.
Many many happy returns of the day dear bro @marthandsai What a lovely conversation we had 🙂 May you find all the happiness in the world 🤗🤗 Lots of love brother pic.twitter.com/sJiE7Z1rmC
— Adivi Sesh (@AdiviSesh) January 25, 2026
MK Stalin | హిందీకి తమిళనాడులో స్థానం లేదు.. భవిష్యత్తులోనూ ఉండబోదు : సీఎం స్టాలిన్
Nayanthara | మమ్ముట్టి-మోహన్‌లాల్ ‘పేట్రియాట్’ నుంచి నయనతార ఫస్ట్ లుక్ రిలీజ్