ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రం లైగర్ (Liger)తో బిజీగా ఉన్నాడు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannadh). విజయ్‌దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా నటిస్తున్న ఈ చిత్రం బాక్సింగ్ బ్యాక్ డ్రాప్లో వస్తోంది. బాలీవుడ్ బ్యూటీ అనన్యపాండే (Ananya Pandey) ఫీ మేల్ లీడ్ రోల్ చేస్తోంది. ఈ చిత్రం నుంచి అదిరిపోయే అప్డేట్ అందించారు మేకర్స్. లైగర్ మొదటి సాంగ్ అక్డీ పక్డీ ప్రోమో (Akdi Pakdi song) ను జులై 8న రిలీజ్ చేస్తున్నట్టు తెలిపింది.
జులై 11న ఫుల్ లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేస్తున్నట్టు టీం ప్రకటించింది ఈ పాటను లిజో జార్జ్ అండ్ డీజే చేతాస్ కంపోజ్ చేశారు. వివిధ ఆయా భాషలకు చెందిన సింగర్స్ ఈ పాట పాడారు. మల్టీలింగ్యువల్ ప్రాజెక్టుగా వస్తున్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తోంది. లైగర్ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్, పూరీ కనెక్ట్స్ బ్యానర్లపై అపూర్వ మెహతా, కరణ్ జోహార్, ఛార్మీ కౌర్, పూరీ జగన్నాథ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ప్రపంచ బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ కీలక పాత్రలో కనిపించనుండటంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోతున్నాయి. లైగర్ వరల్డ్ వైడ్‌గా ఆగస్టు 25న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
50 Days to Release🔥
Let's Celebrate with some Massssss Music! #AKDIPAKDI
1st song- July 11th
Promo on July 8th.#Liger#LigerOnAug25th@TheDeverakonda @MikeTyson @ananyapandayy @karanjohar #PuriJagannadh @Charmmeofficial @apoorvamehta18 @iamVishuReddy @DJLIJO @Dj_Chetas pic.twitter.com/y95UKAyp1U— Puri Connects (@PuriConnects) July 6, 2022