Chiranjeevi | ఎడిటర్ గౌతమ్ రాజు కుటుంబానికి చిరంజీవి ఆర్థిక సాయం
పాపులర్ సినిమా ఎడిటర్ గౌతమ్ రాజు (Gautham Raju) మృతిపట్ల టాలీవుడ్ నటులు చిరంజీవి (Chiranjeevi), బాలకృష్ణ, దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ (Tammareddy Bharadwaja) తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. గౌతమ్ రాజుతో చిరకాల అనుబంధం ఉన్న చిరంజీవి ఆయన కుటుంబానికి తక్షణ సాయం ప్రకటించారు.
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పాపులర్ సినిమా ఎడిటర్ గౌతమ్ రాజు (Gautham Raju) హైదరాబాద్‌లోని నివాసంలో తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆయన మృతిపట్ల టాలీవుడ్ నటులు చిరంజీవి (Chiranjeevi), బాలకృష్ణ, దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ (Tammareddy Bharadwaja)తోపాటు పలువురు సినీ రంగ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థించారు.
గౌతమ్ రాజు కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గౌతమ్ రాజుతో చిరకాల అనుబంధం ఉన్న చిరంజీవి తక్షణ సాయంగా ఆయన కుటుంబానికి రూ.2 లక్షలు ప్రకటించారు. ఈ మేరకు గౌతమ్ రాజు కుటుంబానికి చిరంజీవి తరపున తమ్మారెడ్డి భరద్వాజ రూ.2 లక్షలు అందజేశారు. గౌతమ్ రాజు కుటుంబానికి అండగా ఉంటానని చిరంజీవి భరోసానిచ్చారు.
చిరంజీవి నటించిన చాలా సినిమాలకు గౌతమ్ రాజు ఎడిటర్‌గా పనిచేశారు. ఇవాళ సాయంత్రం గౌతమ్ రాజు అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు తెలుస్తోంది.
Read Also : ప్రముఖ సినిమా ఎడిటర్ గౌతమ్ రాజు కన్నుమూత
Read Also : గౌతమ్‌రాజు మృతిపట్ల చిరంజీవి, బాలకృష్ణ దిగ్భ్రాంతి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
HIV | హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులకు కొత్త ఔషధం.. ఏడాదికి రెండుసార్లు ఇంజెక్షన్ చాలు..
Zakir Naik: జకీర్ నాయక్‌పై నిషేధం మరో అయిదేళ్లు పొడిగింపు
Mukhra Womens Protest | హైదరాబాద్‌కు వస్తున్న రాహుల్‌గాంధీకి ముఖ్రా మహిళల నిరసన
Realme | రియల్మీ ఫోన్ యూజర్లకు గుడ్‌న్యూస్.. నవంబర్ 16 నుంచి కొత్త విధానం అమల్లోకి!
Digital Dashboard | కేంద్రీయ విద్యాలయ డిజిటల్ డ్యాష్‌బోర్డ్‌ను ప్రారంభించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

