ఆదివారం 09 ఆగస్టు 2020
Cinema - Jul 07, 2020 , 14:27:45

ముగ్గురిలో ఎవరంటే ఇష్టం..లులియా ఏం చెప్పిందంటే..?

ముగ్గురిలో ఎవరంటే ఇష్టం..లులియా ఏం చెప్పిందంటే..?

రొమేనియన్ బ్యూటీ లులియా వాంటూర్, సల్మాన్ ఖాన్ మంచి స్నేహితులనే విషయం తెలిసిందే. అప్పడపుడు లులియా, సల్లూభాయ్  సోషల్ మీడియా ద్వారా అభిమానులను పలుకరించారు. లులియా ఇన్ స్టాగ్రామ్ లో అభిమానులతో చిట్ చాట్ చేసింది.  సల్మాన్ ఖాన్, సోహైల్ ఖాన్, అర్బాజ్ ఖాన్ (సోదరులు)ఎవరంటే ఇష్టమని ఓ అభిమాని లులియాను అడిగాడు. దీనికి లులియా చాలా తెలివైన సమాధానమిచ్చి..సదరు అభిమానికి మరో ప్రశ్న అడగాలనే ఆలోచన రాకుండా చేసింది.

ఇంతకీ లులియా సమాధానమేంటనే కదా మీ డౌటు. లులియా చెప్పిన ఒకే ఒక్క పదం ఖాన్. అవును ముగ్గురు సోదరుల్లో కామన్ గా ఉండే పదం ఖాన్. లులియా చాలా జాగ్రత్తగా, క్రియేటివ్ గా ఖాన్ అంటే ఇష్టమని  జవాబు చెప్పడంతో ఆశ్చర్యపోవడం అభిమాని వంతైంది. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo