Legend Saravanan | ఐదు పదుల వయస్సులో ది లెజెండ్ సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచాడు శరవణన్ ఆరుళ్ (Legend Saravanan). ఈ బిజినెస్మెన్ కమ్ యాక్టర్ గరుడన్ ఫేం దురై సెంథిల్ కుమార్ (Durai Senthilkumar)తో రెండో సినిమా చేస్తున్నాడని తెలిసిందే. హోం బ్యానర్ శరవణ ప్రొడక్షన్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆర్ఎక్స్ 100 ఫేం పాయల్ రాజ్‌పుత్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించి చాలా రోజుల తర్వాత క్రేజీ అప్డేట్ అందించారు మేకర్స్. ఈ మూవీ చిత్రీకరణ ప్రస్తుతం జార్జియాలో కొనసాగుతోంది. లొకేషన్లో శరవణన్, పాయల్ రాజ్‌పుత్, డైరెక్టర్ అండ్ టీం దిగిన ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
శరవణన్ ఈ సారి యాక్షన్ పార్ట్‌తో అదరగొట్టబోతున్నాడని స్టిల్స్ చెప్పకనే చెబుతున్నాయి. ఈ మూవీలో ఆండ్రియా జెర్మియా, కిక్ శ్యామ్ కీలక పాత్రల్లో నటించనున్నారని తెలుస్తుండగా.. మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. భారీ కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ మూవీ ఏప్రిల్ 2025లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు తెలుస్తోంది.
జార్జియాలో లెజెండ్ శరవణన్ టీం..
#TheLegend in #Georgia🔥
Shoot Happening in a rapid pace✨@yoursthelegend #TheLegendSaravananProductions #ProductionNo2 #LegendsNextFilm@Dir_dsk @starlingpayal @onlynikil pic.twitter.com/qHBQISPMJc
— BA Raju’s Team (@baraju_SuperHit) December 9, 2024
Fear Trailer | సైలెంట్‌గా భయపెట్టిస్తోన్న బూచోడు.. సస్పెన్స్‌గా వేదిక ఫియర్ ట్రైలర్
Suriya 45 | ఏఆర్ రెహమాన్ ఔట్.. సూర్య 45 టీంలోకి యువ కంపోజర్