OTT Releases This Week | ఈ వారం ఓటీటీలోకి వచ్చే సినిమాల లిస్ట్ వచ్చేసింది. గతవారం ఓటీటీలోకి కల్కితో పాటు రాయన్ సినిమాలు వచ్చి ఓటీటీలో సందడి చేస్తుండగా.. తాజాగా డబుల్ ఇస్మార్ట్‌తో పాటు మరికొన్ని సినిమాలు తమ ఓటీటీ డేట్‌ను ప్రకటించాయి. ఇక ఆ సినిమాలు ఏ ఫ్లాట్‌ఫామ్‌లో వస్తున్నాయి అనేది చూసుకుంటే..
Double iSmart | డబుల్ ఇస్మార్ట్
ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, ట్రెండ్ సెట్టర్ దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన చిత్రం డబుల్ ఇస్మార్ట్. ఈ ఇద్దరూ కలసి చేసిన బ్లాక్ బస్టర్ ‘ఇస్మార్ట్ శంకర్’కు సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రం ఆగష్టు 15న విడుదలై బాక్సాఫీస్ వద్ద డిజాస్టార్‌గా నిలిచింది. అయితే ఈ చిత్రం తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఎలాంటి ప్రకటన లేకుండానే అర్ధరాత్రి నుంచే స్ట్రీమింగ్ అవుతోంది.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. బిగ్ బుల్ (సంజయ్ దత్) పెద్ద డాన్. ప్రపంచాన్ని ఏలుతున్న ఆయన బ్రెయిన్ ట్యూమర్ బారిన పడతాడు. మూడు నెలల కంటే ఎక్కువ బ్రతకడని తేలుతుంది. తన వ్యాధిని నయం చేసుకోవడానికి అన్ని మార్గాలు అన్వేసిస్తున్న బిగ్ బుల్ కి సైంటిస్ట్ (మకరంద్ దేశ్ పాండే) కలుస్తాడు. మెమరీ ట్రాన్స్ఫర్ చేస్తే జీవించే అవకాశం వుందని చెప్తాడు. అయితే ఈ ప్రయోగం వికటిస్తుంటుంది. ఈ ప్రయోగంతో సక్సెస్ అయిన ఇస్మార్ట్ శంకర్ (రామ్ పోతినేని) గురించి తెలుసుకొని అతన్ని పట్టుకోస్తారు. తర్వాత ఏం జరిగింది ? ఇస్మార్ట్ శంకర్ మీద ఈ ప్రయోగం ఫలించిందా ? మెమరీ ట్రాన్స్ఫర్ జరిగిందా ? బిగ్ బుల్ అమరత్వం పోందాడా? ఇస్మార్ట్ శంకర్… బిగ్ బుల్ గా మారాడా? ఇవన్నీ తెరపై చూడాలి.
లేడీ కిల్లర్ (The Lady Killer)
బాలీవుడ్లో విడుదల రోజే డిజాస్టార్ అందుకున్న చిత్రం ఇది. రూ.45 కోట్లు బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం రూ.45వేలు కూడా వసూళ్లు సాధించలేకపోయింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ వేదిక యూట్యూబ్‌లో ఈ చిత్రం ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతుంది. అర్జున్ కపూర్, భూమి ఫడ్నెకర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి అజయ్ బహ్ల్ దర్శకత్వం వహించారు.
‘కమిటీ కుర్రోళ్ళు’ (Committee Kurrollu)
టాలీవుడ్ యువ నటులు సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రధారులుగా వచ్చిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. ఈ సినిమాకు యదు వంశీ దర్శకత్వం వహించగా.. నిహారిక కొణిదెల సమర్పణలో… పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మించారు. చిన్న సినిమాగా వచ్చిన ఈ చిత్రం ఆగస్టు 9న రిలీజై మంచి విజయం సాధించింది. ఇక ఇన్ని రోజులు థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా ఓటీటీ అప్డేట్ను పంచుకుంది. ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ఈటీవీ విన్లో ఈ సినిమా సెప్టెంబర్ 12 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించింది.
ది ఫాల్ గాయ్ (The Fall Guy)
హాలీవుడ్ నటులు ర్యాన్ గోస్లింగ్, ఎమిలీ బ్లంట్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ది ఫాల్ గాయ్. ఈ సినిమాకు డేవిడ్ లెట్చ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ మే 3న థియేటర్లలో విడుదలై మోస్తరు వసూళ్లను దక్కించుకుంది. కాగా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ వేదిక జియో సినిమాలో ఈ చిత్రం తెలుగుతో పాటు ఇతర భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది.
అడియోస్ అమిగో (Adios Amigo)
మలయాళ నటులు సూరజ్ వెంజరమూడు, ఆసిఫ్ అలీ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం అడియోస్ అమిగో(Adios Amigo). ఈ సినిమాకు నాహస్ నజర్ దర్శకత్వం వహించారు. కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ చిత్రం ఆగష్టు 09 న ప్రేక్షకుల ముందుకు వచ్చి యావరేజ్‌గా నిలిచింది. అయితే ఈ సినిమా తాజాగా ఓటీటీ లాక్ చేసుకుంది. ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ వేదికగా.. సెప్టెంబర్ 6 నుంచి స్ట్రీమింగ్కు రానుంది.
కిల్ (Kill Movie)
బాలీవుడ్లో చిన్న సినిమాగా విడుదలై సూపర్ హిట్ అందుకున్న చిత్రం కిల్ (Kill Movie). బాలీవుడ్ యువ నటులు లక్ష్ లాల్వానీ (Lakshya),Kill Movie తాన్య మనక్తిలా (Tanya Maniktala), రాఘవ్ జుయల్ (Raghav Juyal) ప్రధాన పాత్రల్లో నటించగా.. సీనియర్ నటుడు ఆశిష్ విద్యార్థి కీలక పాత్రలో నటించాడు. ఈ సినిమాకు నిఖిల్ నగేశ్ భట్ దర్శకత్వం వహించగా.. ధర్మా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ చిత్రం జులై 5న విడుదలై బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలవడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక తెలుగు నుంచి వచ్చిన కల్కి సినిమాను తట్టుకుని బాక్సాఫీస్ వద్ద గట్టి పోటి నిచ్చింది ఈ చిత్రం. ఇదిలావుంటే తాజాగా ఈ చిత్రం ఓటీటీ లాక్ చేసుకుంది. ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ+హాట్ స్టార్ (Disney Plus Hotstar)లో ఈ సినిమా సెప్టెంబరు 6 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు వెల్లడించింది.
ఇంకా ఇవే కాకుండా వినాయక చవితి ఉండడంతో రవితేజ మిస్టర్ బచ్చన్‌తో పాటు, ఆయ్ సినిమాలు కూడా ఓటీటీ అనౌన్స్మెంట్ ఇవ్వనున్నాయి.
Also read..