Uttar Pradesh Minister: యూపీ మంత్రికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ..
UP Minister: మంత్రి కపిల్ దేవ్ అగర్వాల్‌కు.. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసులో.. ప్రత్యేక ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు ఇవాళ ఈ ఆదేశాలను జారీ చేసింది.
ముజాఫర్‌నగర్: ఉత్తరప్రదేశ్ మంత్రి(Uttarpradesh Minister) కపిల్ దేవ్ అగర్వాల్‌కు.. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసులో.. ప్రత్యేక ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు ఇవాళ ఈ ఆదేశాలను జారీ చేసింది. ప్రత్యేక జడ్జి దేవేంద్ర సింగ్ ఫౌజ్దార్ ఆదేశాలు ఇస్తూ.. సెప్టెంబర్ 13వ తేదీన కోర్టు ముందు హాజరుకావాలన్నారు. వారెంట్ జారీ చేసిన నేపథ్యంలో మంత్రి అగర్వాల్ వచ్చే విచారణ తేదీని కోర్టు ముందు హాజరుకానున్నట్లు ఆయన తరపున లాయర్ పేర్కొన్నారు. ఎటువంటి అనుమతి లేకుండా జనవరి 11వ తేదీన రామ్‌లీలా టీలా లో ఎన్నికల మీటింగ్‌ను ఏర్పాటు చేసిన ఘటనలో మంత్రి అగర్వాల్‌తో పాటు మరికొంత మందిపై కేసు బుక్ చేశారు. ఆ కేసులో ఇవాళ కోర్టు .. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

