Kuberaa | శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం కుబేర. తమిళ నటుడు ధనుష్, టాలీవుడ్ నటుడు నాగార్జున, రష్మిక మందన్నా ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. పాన్ ఇండియా వైడ్‌గా ఈ చిత్రం జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇచ్చింది. మల్టీప్లెక్స్, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.75 (జీఎస్టీ అదనం) వరకు టికెట్ ధరలు పెంచుకోవచ్చు. పెరిగిన ధరలను బట్టి చూసుకుంటే.. మల్టిప్లెక్స్‌లలో అయితే రూ. 270, సింగిల్ స్క్రీన్స్‌లలో రూ. 240 వరకు టికెట్ ధర ఉండబోతుంది. ఈ పెరిగిన ధరలు సినిమా విడుదలైన రోజు నుంచి 10 రోజుల పాటు అమలులో ఉంటాయి. దాదాపు 3 గంటల రన్‌టైంతో వస్తున్న ఈ చిత్రంపై తెలుగుతో పాటు తమిళంలో భారీ అంచనాలు ఉన్నాయి.
Read More