Kuberaa | కుబేరా చిత్రం ప్రీ రిలీజ్ తాజాగా వాయిదా పడింది. త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తామని మేకర్స్ ప్రకటించారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తమిళ నటుడు ధనుష్, టాలీవుడ్ నటుడు నాగార్జున, రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం కుబేర (Kuberaa).
తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో మల్టీ లింగ్వెల్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 20, 2025న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా వరుస ప్రమోషన్స్ నిర్వహిస్తుంది చిత్రయూనిట్. ఇందులో భాగంగానే నేడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో పాటు ట్రైలర్ లాంఛ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేసుకున్నారు. అయితే ఈ క్రమంలోనే గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం జరుగడంతో 241 మంది మరణించారు. దీంతో వారికి నివాళులు అర్పిస్తూ.. ప్రీ రిలీజ్ వేడుకను వాయిదా వేసుకుంది చిత్రయూనిట్. త్వరలోనే కొత్త తేదీతో ముందుకు రాబోతున్నట్లు ప్రకటించింది.
The pre-release event of Kuberaa, scheduled for tomorrow, has been postponed in light of the tragic Ahmedabad flight crash. We stand in solidarity with the grieving families 🙏
— Kuberaa Movie (@KuberaaTheMovie) June 12, 2025
Read More