Kuberaa movie Success | టాలీవుడ్ క్లాసిక్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘కుబేరా’ (Kuberaa). తమిళ నటుడు ధనుష్, టాలీవుడ్ మన్మథుడు నాగార్జున, క్రేజీ బ్యూటీ రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
శేఖర్ కమ్ముల క్రేజ్ ధనుష్, నాగార్జున వంటి స్టార్లు ఉండడంతో సినిమాపై విడుదలకు ముందే భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. అయితే ఈ సినిమాకి విడుదలైన మార్నింగ్ షో నుంచే పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. ఈ సినిమా చూసిన అభిమానులు చాలా రోజుల తర్వాత తెలుగులో ఒక మంచి సినిమా వచ్చిందని కితాబిస్తున్నారు. ఓవర్సీస్లో కూడా ఈ సినిమాకి మంచి టాక్ వచ్చినట్లు తెలుస్తుంది. మరోవైపు ఈ సినిమా టాక్ తెలుసుకోవడానికి అభిమానులతో కలిసి కుబేర సినిమాను వీక్షించారు దర్శకుడు శేఖర్ కమ్ముల, నటుడు ధనుష్. చెన్నైలోని ఒక థియేటర్‌కు వెళ్లిన వీరిద్దరూ అభిమానులతో కలిసి కుబేరను చూశారు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
#Kubera Dhanush and Sekhar at Chennai pic.twitter.com/5u1KWDk7QM
— devipriya (@sairaaj44) June 20, 2025
Read More