Kuberaa – 28 Years Later | ఈ వారం థియేటర్లు సందడి చేస్తున్నాయి. ఒకేరోజు ఏకంగా నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇందులో రెండు తెలుగు సినిమాలు అవ్వగా.. ఒకటి హిందీ నుంచి ఒకటి హాలీవుడ్ నుంచి వచ్చి సందడి చేస్తున్నాయి. అయితే ఈ సినిమాలు ఏంటి అనేది చూసుకుంటే.. దిగ్గజ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన కుబేర(Kuberaa) చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. దీనితో పాటు తెలుగులో వచ్చిన మరో చిత్రం 8 వసంతాలు(8 Vasantalu). బాలీవుడ్ నుంచి వచ్చి థియేటర్లలో విడుదలైన చిత్రం ఆమిర్ ఖాన్ సితారే జమీన్ పర్(Sitaare Jameen Par). మిస్టర్ ఫర్ఫెక్ట్ చాలా రోజుల తర్వాత ప్రేక్షకుల ముందుకు రావడంతో మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇంకా ఇవే కాకుండా.. హాలీవుడ్ నుంచి 28 ఇయర్స్ లేటర్(28 Years Later) అనే చిత్రం ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తుంది. వీటితో పాటుగా ఈ వారం అనేక వెబ్ సిరీస్ లు మరియు సినిమాలు ఓటీటీ ప్రియులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. ఏ ఏ ఓటీటీ లో ఏ సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయో ఒకసారి చూసుకుంటే..
జియో హాట్ స్టార్ :
కేరళ క్రైమ్ ఫైల్స్ 2 (వెబ్‌సిరీస్: సీజన్ 2) – జూన్ 20
ఫౌండ్ (వెబ్‌సిరీస్ : సీజన్ 2) – జూన్ 20
ఆహా :
అలప్పుళ జింఖానా : జూన్ 20
నెట్ ఫ్లిక్స్ :
కే-పాప్ : ది డీమన్ హంటర్స్ – జూన్ 20
గ్రెన్‌ఫెల్ అన్కవర్డ్ ( డాక్యుమెంటరీ) – జూన్ 20
ఒలింపో (వెబ్ సిరీస్) – జూన్ 20
సెమీ సొయిటర్ (ఇంగ్లీష్ )- జూన్ 20
Zee 5 :
డిటెక్టివ్ షెర్డిల్ ( వెబ్‌సిరీస్) – జూన్ 20
గ్రౌండ్ జీరో – జూన్ 20
ప్రిన్స్ ఫ్యామిలీ – జూన్ 20