సినీ నటుడు రాజేంద్రప్రసాద్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం పరామర్శించారు. ఇటీవల రాజేంద్రప్రసాద్ కుమార్తె గద్దె గాయత్రి మృతిచెందిన విషయం తెలిసిందే. సోమవారం ఆమె పెద్ద కర్మ సందర్భంగా కేపీహెచ్‌బీ కాలనీలోని రాజేంద్రప్రసాద్ నివాసానికి విచ్చేసిన కేటీఆర్.. గాయత్రి చిత్ర పటం వద్ద నివాళులర్పించారు. అనంతరం రాజేంద్రప్రసాద్‌ను ఓదార్చారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్ వెంట ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, వివేకానంద, కాలేరు వెంకటేశ్‌లు ఉన్నారు.